logo

22 నామినేషన్ల ఆమోదం

అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో 28 మంది అభ్యర్థులు 44 నామినేషన్లు దాఖలు చేశారని రిటర్నింగ్‌ అధికారి అభిషేక్‌ శనివారం తెలిపారు.

Published : 28 Apr 2024 01:39 IST

పాడేరు, న్యూస్‌టుడే: అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో 28 మంది అభ్యర్థులు 44 నామినేషన్లు దాఖలు చేశారని రిటర్నింగ్‌ అధికారి అభిషేక్‌ శనివారం తెలిపారు. వీటిలో 22 మంది నామపత్రాలు ఆమోదించి ఆరుగురివి పలు కారణాలతో తిరస్కరించినట్లు పేర్కొన్నారు. శెట్టి గంగాధరస్వామి (కాంగ్రెస్‌), పాంగి రాజారావు (భారతీయ జనతా పార్టీ), మత్స్యలింగం (వైకాపా), కిల్లో అనిల్‌ (లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ), చుంచు రాజబాబు (గోండ్యాన దండకారణ్య పార్టీ), బురిడి ఉపేంద్ర (జై భారత్‌ జాతీయ పార్టీ), పచ్చపుండి రామకృష్ణ (భారత్‌ ఆదివాసీ పార్టీ), స్వతంత్ర అభ్యర్థులు సివేరి అబ్రహం, మర్రి ఉషారాణి, చెండా ఏలియా, కమ్మిడి నిర్మల, గెమ్మెలి కృష్ణారావు, తాంగుల రామదాసు, నరాజీ గోవిందరావు, నరాజీ మధుబాబు, వంతాల రామన్న, సమర్డి గులాబి, సమర్డి భవాని నామపత్రాలను ఆమోదించారు.

ఆరుగురివి తిరస్కరణ: వైకాపా ప్రధాన అభ్యర్థి నామినేషన్‌ ఆమోదించడం వల్ల డమ్మీ అభ్యర్థి రేగం చాణక్య నామినేషన్‌ తిరస్కరించారు. పాచిపెంట శాంతకుమారి ఫాం -ఎ, ఫాం-బి సమర్పించనందున ఆమెవి, భాజపా ప్రధాన అభ్యర్థి నామపత్రాలు ఆమోదించడంతో డమ్మీ అభ్యర్థి పాంగి శ్రీలక్ష్మి నామినేషన్లు తిరస్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని