logo

తండ్రీకూతురికి ఓటుతో బుద్ధి చెప్పండి: సీఎం రమేశ్‌

గత ఎన్నికల్లో మాడుగుల ఎమ్మెల్యేగా బూడి ముత్యాలనాయుడిని గెలిపించడం ఈ ప్రాంత ప్రజలకు శాపంగా మారిందని అనకాపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్థి సీఎం రమేశ్‌ పేర్కొన్నారు.

Published : 30 Apr 2024 03:20 IST

తురువోలులో ప్రసంగిస్తున్న సీఎం రమేశ్‌, పక్కన బండారు, రామానాయుడు తదితరులు

చీడికాడ, న్యూస్‌టుడే: గత ఎన్నికల్లో మాడుగుల ఎమ్మెల్యేగా బూడి ముత్యాలనాయుడిని గెలిపించడం ఈ ప్రాంత ప్రజలకు శాపంగా మారిందని అనకాపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్థి సీఎం రమేశ్‌ పేర్కొన్నారు. ఉప ముఖË్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని ముత్యాలనాయకుడు రూ.కోట్లు దండుకున్నారని ఆరోపించారు. పేద రైతులను భయపెట్టి భూముల్ని కబ్జా చేశారన్నారు. ఈ ఎన్నికల్లో ఆయనతోపాటు కుమార్తెనూ చిత్తుగా Ëఓడించి బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారు. చీడికాడ మండలం చుక్కపల్లి, చెట్టుపల్లి, అర్జునగిరి, తురువోలు గ్రామాల్లో సోమవారం రాత్రి రోడ్‌షో నిర్వహించారు. ఉత్తరాంధ్ర వనరులను వైకాపా పెద్దలు దోచుకున్నారన్నారన్నారు. ఎంపీగా తనను, ఎమ్మెల్యేగా బండారు సత్యనారాయణమూర్తిని గెలిపిస్తే వైకాపా నాయకుల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. అపారమైన సాగునీటి వనరులున్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అసెంబ్లీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, తెదేపా నాయకుడు పైలా ప్రసాదరావు, జనసేన అధ్యక్షుడు రాయపురెడ్డి కృష్ణ, సింహాచలంనాయుడు, రమణమ్మ, సన్యాసినాయుడు, ముసలినాయుడు, చిన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

దళితులంతా ఏకమవ్వాలి

జనసేనలో చేరిన వైకాపాకు చెందిన దళిత సంఘాల నాయకులతో సుందరపు, శ్రీవేణి

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: దళిలంతా ఏకమై సీఎం జగన్‌ ఓడించి మళ్లీ హైదరాబాద్‌కు డోర్‌ డెలవరీ చేయాలని జనసేన ఎలమంచిలి  జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. మడుతూరుతోపాటు వివిధ గ్రామాలకు చెందిన వైకాపాకు చెందిన దళిత సంఘాల నాయకులు సోమవారం ఉమ్మడి జిల్లా జనసేన కార్యదర్శి మోటూరు శ్రీవేణి ఆధ్వర్యంలో జనసేన గూటికి చేరారు. పార్టీలోకి చేరిన సంఘాల నాయకులకు ఆయన కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితుల ఓట్లుతో గెలిచిన జగన్‌ ఐదేళ్లలో దళితులను హత్యచేసిన వారిని ప్రోత్సహించడం, దళితుల భూముల్లో జగనన్న కాలనీలు ఏర్పాటుచేసి పరిహారం ఇవ్వకపోవడం, ఎస్సీల పైనే ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయించి జైలుకు పంపించడం, డాక్టర్‌ సుధాకర్‌ చనిపోవడం వంటివి చేశారన్నారు. సంఘాల నాయకులు తట్టా శ్రీనివాసరావు, నడుపూరి హారతి, ప్రవీణ్‌, కొత్తపల్లి సన్యాసినాయుడు, మార్లపల్లి సుజాత పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని