logo

కూటమితోనే గిరిజన ప్రాంత అభివృద్ధి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే గిరిజన ప్రాంత అభివృద్ధి సాధ్యపడుతుందని ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు అన్నారు.

Published : 30 Apr 2024 03:23 IST

రొంపల్లిలో తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి దొన్నుదొర, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు తదితరుల ప్రచారం

అనంతగిరి, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే గిరిజన ప్రాంత అభివృద్ధి సాధ్యపడుతుందని ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు అన్నారు. తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి దొన్నుదొరతో కలిసి రొంపల్లి, గరుగుబిల్లి పంచాయతీల్లో సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా రాజారావు మాట్లాడుతూ... వైకాపా పాలనలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. మన్యంలో మౌలిక సదుపాయాలు కూడా లేక అందరూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దొన్నుదొర మాట్లాడుతూ వైకాపా పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. అరకు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో కమలం గుర్తుకు ఓటేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నాయకులు బూర్జ లక్ష్మి, బుజ్జిబాబు, జోగులు, ఆనంద్‌, లక్ష్మి, తమన్నా తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని