logo

అందరి మందిరం

పవిత్ర కృష్ణా నదీ తీరంలో ప్రకాశం బ్యారేజీ దిగువున నిర్మించిన మానస సరోవర ధ్యాన ఆశ్రమ పిరమిడ్‌ కేంద్రం ఎంతో మందికి ఉచిత ధ్యానం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. బ్రహ్మర్షి పితామహ పత్రీజీ ఆశయాలకు అనుగుణంగా

Published : 22 May 2022 04:47 IST

ఆరోగ్యం.. ఆనందం.. సేవల సమ్మిళితం  మానస సరోవరం

తాడేపల్లి, న్యూస్‌టుడే: పవిత్ర కృష్ణా నదీ తీరంలో ప్రకాశం బ్యారేజీ దిగువున నిర్మించిన మానస సరోవర ధ్యాన ఆశ్రమ పిరమిడ్‌ కేంద్రం ఎంతో మందికి ఉచిత ధ్యానం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. బ్రహ్మర్షి పితామహ పత్రీజీ ఆశయాలకు అనుగుణంగా 9 ఏళ్ల కిందట కళ్లం రామిరెడ్డి దీనిని నిర్మించారు. ధ్యానం, శాఖాహార ప్రాధాన్యతను వివరించడంతో పాటు సామాజిక సేవలు అందిస్తూ ఈ కేంద్రం స్ఫూర్తిబాటలో పయనిస్తోంది.

గిజా పిరమిడ్‌ నమూనాగా..: ఈ ధ్యాన ఆశ్రమంలోని పిరమిడ్‌ కేంద్రాన్ని ఈజిప్టులోని గిజా పిరమిడ్‌ నమూనాగా తీర్చిదిద్దారు. ఆవరణ లోపల పచ్చదనం, బుద్ధవనం, చుట్టూ ఉద్యాన వనం ఆకర్షణీయంగా కన్పిస్తాయి. గోమాతలు, లేగదూడలు సందడి చేస్తాయి. ప్రతి ఆదివారం ఉచిత ధ్యాన తరగతులు నిర్వహిస్తుంటారు. ఉచితంగానే భోజనం సదుపాయం కల్పిస్తారు. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, పల్లాడు తదితర జిల్లాల నుంచి ఎంతోమంది ఔత్సాహికులు ఇక్కడకు వచ్చి ధ్యానం చేస్తుంటారు. 

సామాజిక సేవలో...: పిరమిడ్‌ కేంద్రం ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2020 కొవిడ్‌ కారణంగా లాక్‌డౌన్‌లో ఈ ప్రాంతవాసులకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరకులను ఉచితంగా ఇచ్చారు. 2021లో కొవిడ్‌ రోగులకు, తాడేపల్లి ఆరోగ్య కేంద్రానికి మెడికల్‌ కిట్స్‌ అందించారు. షెడ్ల నిర్మాణం కోసం రూ.12 లక్షలు ఆర్థిక సాయం అందించారు. పిరమిడ్‌ ధ్యాన కేంద్రం నిర్వాహకుడు కళ్లం రామిరెడ్డి స్వగ్రామమైన నూతక్కిలో రూ.4 లక్షల విలువైన కైలాసయాత్ర రథం బహూకరించారు. 

నిరాటంకంగా ‘హ్యాపీ సండే’ : 2016 ఆగస్టులో కృష్ణా పుష్కరాలకు ధ్యాన మహోత్సవాల పేరిట 12 రోజులు 25 వేల మంది ధ్యానులతో ఉత్సవం, నవంబరులో మహాకర్ణ ధ్యాన మహాయజ్ఞం పేరుతో 8 వేల మందితో శాకాహార ర్యాలీలు నిర్వహించారు. 2018 జనవరి నుంచి పత్రీజీ సూచనలతో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల హ్యాపీ సండే కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో సీనియర్‌ పిరమిడ్‌ మాస్టర్ల ద్వారా రోజంతా ఉచిత ధ్యాన, జ్ఞాన తరగతులు నిర్వహిస్తున్నారు. 

రోజుకో మంచిమాట: కళ్లం రామిరెడ్డి, స్థాపకులు 

ధాన్యం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని విశ్వసించి ఆశ్రమం ఏర్పాటు చేశా. ఎంతోమందికి ఆత్మజ్ఞానం ప్రభోదిస్తున్నా. గత మూడేళ్లుగా రోజుకో మంచిమాట పేరుతో వాట్సాప్‌ ద్వారా అందరికీ సందేశాలు పంపుతున్నా. పదో తరగతి కూడా ఉత్తీర్ణత కానీ నేను పత్రీజీ ప్రోత్సాహంతో మానస సరోవరం ఓ పుస్తకం రాశా. ఇది బహుళ ప్రాచూర్యం పొందింది. అదే స్ఫూర్తితో అనుభవమే జ్ఞానం అనే రెండో పుస్తకం ఆవిష్కరించా. ఎవరైనా ఇక్కడకు రావచ్చు. ఉచిత ధ్యానం పొందవచ్చు.

‘హాయిగా సుఖాసనంలో కూర్చొని చేతులు రెండు కలిపి కళ్లు మూసుకుని సహజంగా జరిగే ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసాలను గమనించడమే ధ్యానం’ 

- పిరమిడ్‌ ధ్యాన నవరత్నం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని