logo

కారుణ్య నియామకాలు చేపట్టాలి

కొవిడ్‌ వేళ చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియమాకాలు చేపట్టాలని ఏపీ జేఏసీ అమరావతి ఎన్టీఆర్‌ జిల్లా ఛైర్మన్‌ డి.ఈశ్వర్‌, ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.

Published : 28 Mar 2023 04:45 IST

జ్ఞానిబాబు భార్య స్వాతి నుంచి వివరాలు తెలుసుకుంటున్న ఏపీ జేఏసీ అమరావతి ఎన్టీఆర్‌ జిల్లా ఛైర్మన్‌ ఈశ్వర్‌, ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు

అజిత్‌సింగ్‌నగర్‌, న్యూస్‌టుడే : కొవిడ్‌ వేళ చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియమాకాలు చేపట్టాలని ఏపీ జేఏసీ అమరావతి ఎన్టీఆర్‌ జిల్లా ఛైర్మన్‌ డి.ఈశ్వర్‌, ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా కొవిడ్‌తో మరణించి కారుణ్య నియామకం పొందని ఉద్యోగుల కుటుంబాలను జేఏసీ జిల్లా కమిటీ నాయకులు సోమవారం పరామర్శించారు. వాంబేకాలనీలో ఎల్‌.జ్ఞానిబాబు కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. కొవిడ్‌తో 2021, మే 14న ఆర్టీసీ కండక్టర్‌ ఎల్‌.జి.బాబు చనిపోతే నేటి వరకు కారుణ్య నియామకం కానీ, పింఛను-గ్రాట్యూటి వంటి సదుపాయాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ తీరుపై విస్మయం వ్యక్తం చేశారు. జ్ఞానిబాబు భార్య స్వాతి.. తాను చిన్న పాపతో కుటుంబ పోషణకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఆమెకు ధైర్యం చెప్పిన నాయకులు.. జేఏసీ పక్షాన ప్రభుత్వంతో పోరాడైనా త్వరితగతిన న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈశ్వర్‌, శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఇప్పటికే నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్నామని, వర్క్‌ టూ రూల్‌ పాటిస్తున్నామన్నారు. కారుణ్య నియామకాలను చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ.. మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పేందుకు జేఏసీ నాయకత్వం నిర్ణయించిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులు బి.కిశోర్‌కుమార్‌, డి.శ్రీనివాస్‌, బత్తిన రామకృష్ణ, జి.దుర్గారావు, షేక్‌ ఇస్మాయిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని