logo

కూటమి విజయదుందుభి ఖాయం

రాష్ట్రంలో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయ దుందుభి మోగించడం ఖాయమని.. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గెలుపును ఎవరూ ఆపలేరని ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ చెప్పారు.

Published : 28 Apr 2024 04:05 IST

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌

అవనిగడ్డ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయ దుందుభి మోగించడం ఖాయమని.. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గెలుపును ఎవరూ ఆపలేరని ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ చెప్పారు. జనసేన పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం కోసం శనివారం అవనిగడ్డ వచ్చిన సందర్భంగా ఆయన ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. రాజకీయంపై ఆసక్తితోనే కూటమి తరఫున ప్రచారానికి వచ్చాను. తొలుత కాస్త భయపడినా సినీ పరిశ్రమ తరహాలోనే రాజకీయ రంగంలో కూడా మంచి మద్దతు లభించిందన్నారు. ఇప్పటికే పిఠాపురం, కాకినాడలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నాను.. అక్కడ కూడా జనసేన పార్టీ గెలుపు ఖాయమన్నారు. మే 9, 10 తేదీల్లో మళ్లీ పిఠాపురం వెళ్లి ప్రచారం చేస్తానని తెలిపారు. తన పర్యటనలో విద్యార్థులతో మాట్లాడిస్తే రహదారులు అత్యంత దారుణంగా ఉన్నాయని.. ఇలా ఉంటే పాఠశాలలు, కళాశాలలకు సమయానికి ఎలా చేరుకోగలమని ఆందోళన వ్యక్తం చేశారన్నారు. తాగు, సాగు నీటి సమస్యలు పరిష్కరించాలని కోరినట్లు చెప్పారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని ఎదురుమొండి దీవులకు వారధి నిర్మించి ఓట్లు అడగడానికి వస్తానని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు హామీ ఇచ్చి నిర్మించకుండానే మళ్లీ ఓట్లు అడిగేందుకు ఎలా వేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి విక్రయిస్తూ యువత భవిష్యత్తు నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఐదేళ్ల వైకాపా పాలనతో రాష్ట్రం రెండు దశాబ్దాల వెనక్కి వెళ్లిందని.. కూటిమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేగాని రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఉచితాలు హక్కుగా భావిస్తున్నారు. ప్రజల్లో అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం వస్తే అందరూ బాగుంటారు. గ్రామాలన్నీ అభివృద్ధి చెంది రాష్ట్రం బాగు పడుతుందని అన్నారు. మండలి బుద్ధప్రసాద్‌ అధికారంలో ఉన్నా, లేకపోయినా ప్రజలకు అండగా ఉన్నారని, ఆయన సేవలకు ప్రజలు నమ్మకంతో గెలిపిస్తారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు