logo

‘జగన్‌ వస్తే అవస్థలు తప్పవు..’

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అవస్థలు తప్పవని, ప్రజలంతా కూటమిని గెలిపించాలని నిర్ణయం తీసేసుకున్నారని పెడన తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్‌ అన్నారు.

Published : 29 Apr 2024 04:59 IST

చెరుకుమిల్లి (కృత్తివెన్ను), న్యూస్‌టుడే: సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అవస్థలు తప్పవని, ప్రజలంతా కూటమిని గెలిపించాలని నిర్ణయం తీసేసుకున్నారని పెడన తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్‌ అన్నారు. ఆదివారం మండలంలోని చెరుకుమిల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ తిరిగి సూపర్‌-6 పథకాలను వివరించారు. బాలశౌరి తనయుడు అనుదీప్‌, తెదేపా రాష్ట్ర కార్యదర్శి కిషన్‌తేజ, సుగుణబాబు, నాగుల మీరా, శ్రీనివాసరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గెలుపు లాంఛనమే: తెదేపా, జనసేన, భాజపా కూటమితో వైకాపా గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని లక్ష్మీపురం గ్రామతెదేపా అధ్యక్షుడు పులగం నాగభూషణం అన్నారు. మండలంలోని లక్ష్మీపురంలో  ఎన్నికల ప్రచారం నిర్వహించారు.తాతాజీలు, చింతారావు ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు.

బంటుమిల్లి  : రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని కాగిత కృష్ణ ప్రసాద్‌ సతీమణి కాగిత శిరీష అన్నారు. ఆదివారం మండలంలోని కంచడంలో ఆమె ప్రచారం నిర్వహించారు. మాజీ సర్పంచి గంధం సత్యనారాయణ, గుడిశేవ ధనశ్రీరామమూర్తి, దాసరి కరుణ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు మండలంలోని ఆముదాలపల్లిలో ప్రచారం నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని