logo

బ్యాంకు ఖాతాలకే పింఛను సొమ్ము జమ

ఏప్రిల్‌ నెలకు సంబంధించిన సామాజిక పింఛన్ల నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకే జమ చేయనున్నట్టు కలెక్టర్‌ డీకే బాలాజీ తెలిపారు.

Published : 29 Apr 2024 05:20 IST

కలెక్టరేట్‌ (మచిలీపట్నం), న్యూస్‌టుడే: ఏప్రిల్‌ నెలకు సంబంధించిన సామాజిక పింఛన్ల నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకే జమ చేయనున్నట్టు కలెక్టర్‌ డీకే బాలాజీ తెలిపారు. పింఛన్ల కోసం ఎవరూ సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదనీ, మే ఒకటో తేదీన లబ్ధిదారుల ఖాతాలకే నగదు జమచేస్తారన్నారు. పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఆదివారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేశారని తెలిపారు. జిల్లాలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర 16 విభాగాలకు చెందిన లబ్ధిదారులు 2,43,400 మంది ఉన్నారనీ వీరికి పింఛనుగా రూ.71.75 కోట్లు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. లబ్ధిదారుల్లో 75 శాతం మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, మే ఒకటిన వారి ఖాతాలకు నగదు జమచేస్తారని వివరించారు. బ్యాంకు ఖాతాలు లేనివారితో పాటు ఆరోగ్య సమస్యలున్నవారు, దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దకే సచివాలయ ఉద్యోగులు వచ్చి పింఛను మొత్తాలను మే ఒకటి నుంచి అయిదో తేదీ లోపు అందజేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మే నెలకు సంబంధించిన పింఛన్లను జూన్‌ ఒకటిన ఖాతాలకు జమచేస్తారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని