YS Sharmila: రాష్ట్రంలో లిక్కర్‌ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్‌ షర్మిల

రాష్ట్రంలో లిక్కర్‌ మాఫియా నడుస్తోందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.

Updated : 18 Apr 2024 19:35 IST

నార్పల: రాష్ట్రంలో లిక్కర్‌ మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. మద్య నిషేధం అమలు చేస్తామన్న జగన్‌ హామీ గంగలో కలిసిపోయిందని ఎద్దేవా చేశారు. ల్యాండ్‌, శాండ్‌ మాఫియాలు రాష్ట్రంలోని వనరులను దోచుకున్నాయని విమర్శించారు. అనంతపురం జిల్లా నార్పలలో నిర్వహించిన కాంగ్రెస్‌ న్యాయ్‌  యాత్రలో షర్మిల మాట్లాడారు. ‘‘ఓటు వేసినప్పుడు ఎవరికి వేస్తున్నామో ప్రజలు ఆలోచించాలి. మీ కోసం, మీ పిల్లల భవిష్యత్‌ కోసం ఓటు వేయాలి. గతంలో జగన్‌ ఇచ్చిన హామీలు నెరవేరాయో లేదో ఆలోచించాలి. పంటలకు మద్దతు ధర కోసం స్థిరీకరణ నిధి ఏమైంది. ప్రత్యేక హోదా ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలకు ఊపిరి లాంటిది. దానిని ఇవ్వకుండా భాజపా మోసం చేస్తోంది. రాష్ట్రానికి భాజపా ఏం చేసిందని గులాంగిరీ చేస్తున్నారు. రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేశారు. భాజపాతో జగన్‌కు రహస్య పొత్తు ఉంది. ప్రత్యేక హోదా గురించి వైకాపా నాయకులకు చిత్తశుద్ధిలేదు. హోదా కోసం జగన్‌ ఒక్క ఉద్యమమైనా చేశారా? వీరికి ఓట్లు వేస్తే ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని రాదు’’ అని షర్మిల విమర్శించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని