logo

ఐదేళ్లలో ఇష్టారాజ్యంగా ప్రకృతి వనరుల దోపిడీ

వైకాపా ఐదేళ్ల పాలనలో దోపిడీ, అవినీతి, అక్రమాలు జరిగాయని, ప్రకృతి వనరులను సైతం దోచుకున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు.

Published : 28 Apr 2024 03:23 IST

చంద్ర ఆసుపత్రి కూడలిలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ 

ఆజాద్‌నగర్‌(అనంతపురం), న్యూస్‌టుడే: వైకాపా ఐదేళ్ల పాలనలో దోపిడీ, అవినీతి, అక్రమాలు జరిగాయని, ప్రకృతి వనరులను సైతం దోచుకున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఆయన శనివారం అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే ఇండియా కూటమి అభ్యర్థి జాఫర్‌, ఎంపీ అభ్యర్థి వజ్జ మల్లికార్జున తరఫున నగరంలో రోడ్‌ షో ద్వారా ప్రచారం నిర్వహించారు. శ్రీకంఠం, చంద్ర ఆసుపత్రి కూడలి, నీలిమ కూడలి, రుద్రంపేట, తపోవనం, కళ్యాణదుర్గం కూడళ్లు, రాంనగర్‌ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. రామకృష్ణ మాట్లాడుతూ.. తప్పుడు హమీలతో అధికారం చేపట్టిన జగన్‌ ఐదేళ్లలో ఇసుక, మద్యం, గంజాయి మాఫియాలను పెంచి పోషించాడని ఆరోపించారు. రైతాంగ, చేనేత, కార్మిక, దళిత, గిరిజన సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాడని విమర్శించారు. సీపీఐ కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీశ్‌, సత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్‌, జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున, జిల్లా కార్యవర్గ సభ్యులు, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్‌బాబు, నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని