logo

వాలంటీర్ల వద్దే సెల్‌ఫోన్లు

గ్రామ వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచడంతో పాటు వారి నుంచి సెల్‌ఫోన్లు, ఇతర ప్రభుత్వ సామగ్రిని స్వాధీనం చేసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే.

Published : 28 Apr 2024 03:26 IST

ఉరవకొండ, న్యూస్‌టుడే: గ్రామ వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచడంతో పాటు వారి నుంచి సెల్‌ఫోన్లు, ఇతర ప్రభుత్వ సామగ్రిని స్వాధీనం చేసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. ఉరవకొండ నియోజకవర్గంలో నేటికీ పలువురు వాలంటీర్ల వద్ద సెల్‌ఫోన్లు ఉన్నాయి. పంచాయతీల అధికారులు తమకు కావాల్సిన వాలంటీర్ల వద్ద సెల్‌ఫోన్లు అలాగే ఉంచారనే చర్చ నడుస్తోంది. లబ్ధిదారుల వివరాలన్నీ అందులో నిక్షిప్తమై ఉన్నాయి. వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉన్నా గ్రామాల్లో మాత్రం తమ ప్రభావం చూపడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు అధికారులు  వాలంటీర్ల నుంచి పూర్తి స్థాయిలో సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఉరవకొండ మండలం నింబగల్లు పంచాయతీలో ఓ సచివాలయ ఉద్యోగి తనకు అనుకూలంగా ఉన్న వాలంటీర్ల నుంచి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకోలేదు. ఎన్ని స్వాధీనం చేసుకున్నారు? ఎక్కడ భద్రపరిచారు? అనే వివరాలను అధికార యంత్రాంగం బహిర్గతం చేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని