logo

Chittoor News: చంద్రగిరిలో వైకాపాకు ఎదురుదెబ్బ.. తెదేపాలోకి కీలక నేతలు

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైకాపాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వైకాపా ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న పలువురు కీలక నేతలు ఆపార్టీని వీడి తెలుగుదేశంలో చేరుతున్నారు

Updated : 06 Apr 2024 08:32 IST

చిత్రంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానితెదేపా చేరిన పాకాల జడ్పీటీసీ సభ్యురాలు నంగా పద్మజారెడ్డి, భర్త నంగా బాబురెడ్డి ఇతర కుటుంబ సభ్యులు, చిత్రంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని

 చంద్రగిరి, పాకాల, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైకాపాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వైకాపా ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న పలువురు కీలక నేతలు ఆపార్టీని వీడి తెలుగుదేశంలో చేరుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో శుక్రవారం తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త రమణమూర్తి, మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ ముడిపల్లి సురేష్‌రెడ్డి, పాకాల జడ్పీటీసీ సభ్యురాలు నంగా పద్మజారెడ్డి తదితరులు తెదేపాలో చేరారు. పద్మజారెడ్డితోపాటు ఆమె భర్త వైకాపా సేవాదళ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నంగా బాబురెడ్డి, పార్టీకి రాజీనామా చేసి తెదేపాలో చేరారు. వైకాపాలో కష్టపడిన వారికి తగిన గుర్తింపు లేదని, కుటుంబ పాలన తోడు ఎమ్మెల్యే పీఏ, పీఆర్వోల పెత్తనం ఎక్కువైందన్నారు. వైకాపాలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనా ఉత్సవ విగ్రహాలుగా ఉండాల్సి వచ్చిందని పద్మజారెడ్డి విమర్శించారు. ఐదేళ్లుగా ఒక్క అభివృద్ధి పనిచేయలేకపోయామని.. కనీసం ప్రొటోకాల్‌ పాటించకుండా అవమానాలకు గురిచేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.తెదేపా చేరిన పాకాల జడ్పీటీసీ సభ్యురాలు నంగా పద్మజారెడ్డి, భర్త నంగా బాబురెడ్డి ఇతర కుటుంబ సభ్యులు,

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని