logo

కమ్యూనిటీ హాలులో వైకాపా నాయకుల సమావేశం?

తిరుమలలో కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం నేపథ్యంలో అదే సమయంలో వైకాపా తిరుమల విభాగం అధ్యక్షుడు చిన్నముని ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక కమ్యూనిటీ భవనంలో సమావేశమయ్యారు.

Published : 30 Apr 2024 02:37 IST

తిరుమల: తిరుమలలో కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం నేపథ్యంలో అదే సమయంలో వైకాపా తిరుమల విభాగం అధ్యక్షుడు చిన్నముని ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక కమ్యూనిటీ భవనంలో సమావేశమయ్యారు. తాము స్థానికులమని ఇక్కడి సమస్యలపై చర్చించేందుకు వచ్చామని చెప్పి వైకాపా ప్రచారానికి తెరతీశారు. కూటమి ప్రచారాన్ని అడ్డుకున్న ఎన్నికల పర్యవేక్షకులు అనంతరం వారివద్దకు చేరుకుని సమావేశాన్ని నిలిపివేయాలని చెప్పడంతో బయటకు వచ్చారు. కూటమి ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించగా కమ్యూనిటీ భవనం వద్ద మాత్రం పోలీసుల పరిశీలన కనిపించలేదు. కూటమి ప్రచారం సమయంలో ఉద్రిక్తతలకు అవకాశం కల్పించేలా కమ్యూనిటీ భవనంలో వైకాపా నాయకులు సమావేశం నిర్వహిస్తున్నా పట్టించుకునేవారు లేరు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు