logo

కోర్టులో కేసున్నా.. రోడ్డు నిర్మాణం

మండలంలోని ముడిపల్లి పంచాయితీలోని వెంగన్న కండ్రిగ ఎస్టీకాలనీ వద్ద వైకాపా నాయకులు దౌర్జన్యంగా రోడ్డు వేస్తున్నారని గ్రామస్థులు సోమవారం ఆరోపించారు.

Published : 30 Apr 2024 02:40 IST

కాల్వ పొరంబోకుపై మట్టి తోలి నిర్మిస్తున్న రోడ్డు

నగరి, న్యూస్‌టుడే: మండలంలోని ముడిపల్లి పంచాయితీలోని వెంగన్న కండ్రిగ ఎస్టీకాలనీ వద్ద వైకాపా నాయకులు దౌర్జన్యంగా రోడ్డు వేస్తున్నారని గ్రామస్థులు సోమవారం ఆరోపించారు. ఈ కాలనీ సమీపంలోని కాలవ పొరంబోకు స్థలంలో అక్రమంగా రోడ్డు వేయడాన్ని కోర్టులో కేసు వేయగా స్టే ఇచ్చారన్నారు. ఎన్నికల కోడ్‌ ఉన్నా, అధికార పార్టీ నాయకులు కాలువ పొరంబోకు స్థలంలో గ్రావెల్‌ తోలి రోడ్డు పనులు చేస్తున్నారని, అధికారులు స్పందించి అడ్డుకోవాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని