logo

బ్యాంకు ఖాతాల్లేకుంటే ఇంటి వద్దే పింఛన్‌ పంపిణీ: కలెక్టర్‌

సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని మే ఒకటిన రెండు పద్ధతుల్లో చేపట్టనున్నామని కలెక్టర్‌ షన్మోహన్‌ తెలిపారు.

Published : 30 Apr 2024 02:41 IST

మాట్లాడుతున్న షన్మోహన్‌

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని మే ఒకటిన రెండు పద్ధతుల్లో చేపట్టనున్నామని కలెక్టర్‌ షన్మోహన్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బ్యాంకు ఖాతాలు లేని, సాంకేతిక కారణాలతో బ్యాంకు ఖాతాలో నగదు జమకాని వారికి ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. రెండు బ్యాంకుల్లో ఖాతాలు ఉంటే.. ఏ ఖాతాకు నగదు జమైందో వివరాలు తెలియజేస్తామని’ కలెక్టర్‌ వెల్లడించారు.

ఎన్నికల్లో విధుల్లో పాల్గొనే 16,547 మంది ఉద్యోగులకు మే 5, 6 తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు. మే 6, 7 తేదీల్లో 596 మంది ఇంటి నుంచి ఓటు వేసేలా చర్యలు చేపట్టామన్నారు. మే 21, 22 తేదీల్లో చిత్తూరులో గంగమ్మ జాతర: చిత్తూరులో గంగమ్మ జాతరను మే 21, 22 తేదీల్లో నిర్వహించనున్నామని కలెక్టర్‌ తెలిపారు. 14న జాతర చాటింపు ఉంటుంన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని