logo

సదుంలో రణరంగం

బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్‌.. మంత్రి పెద్దిరెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో చేపట్టిన ప్రచారం ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీశాయి.

Updated : 30 Apr 2024 06:22 IST

రామచంద్రయాదవ్‌పై దాడి చేసేందుకు చెప్పు తీస్తున్న వైకాపా కార్యకర్త

ఈనాడు, చిత్తూరు: బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్‌.. మంత్రి పెద్దిరెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో చేపట్టిన ప్రచారం ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీశాయి. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఈ పంచాయితీ పోలీస్‌ స్టేషన్‌కు చేరగా అక్కడ కూడా వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడికి చేరుకున్న రామచంద్రయాదవ్‌పై దాడి వైకాపా శ్రేణులు స్టేషన్‌లోకి దూసుకొచ్చాయి.  పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా నిలిపిన బీసీవైపీ ప్రచార రథాన్ని తగులపెట్టారు. ఎస్పీ మణికంఠ పరిస్థితి సమీక్షించారు.

అల్లరిమూకల దాడిలో పలిగిన కారు అద్దాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని