logo

16,23,149.. ఇదీ ఓటర్ల సంఖ్య

జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. రెండవ అనుబంధ జాబితా(సప్లిమెంటరీ)ను కూడా ప్రచురించి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునే మొత్తం ఓటర్ల  వివరాలను శనివారం కలెక్టర్‌ మాధవీలత వెల్లడించారు.

Updated : 28 Apr 2024 04:31 IST

రాజమహేంద్రవరం కలెక్టరేట్‌: జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. రెండవ అనుబంధ జాబితా(సప్లిమెంటరీ)ను కూడా ప్రచురించి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునే మొత్తం ఓటర్ల  వివరాలను శనివారం కలెక్టర్‌ మాధవీలత వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 22న తుది జాబితా ప్రచురించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దరఖాస్తు చేసుకున్న వారికి ఓటు హక్కు కల్పిస్తూ మళ్లీ మార్చి 20న మొదటి సప్లమెంటరీ ప్రచురించారు. కొత్త ఓటు నమోదుకు గడువు ఈ నెల 15 వరకు ఎన్నికల కమిషన్‌ కల్పించడంతో ఆరోజు వరకు కొత్తగా ఫారం-6 దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు రెండవ అనుబంధ జాబితాలో చోటు కల్పించారు.

పెరిగారిలా..:  జనవరి 22న తుదిజాబితా ప్రచురించిన నాటికి జిల్లా మొత్తం ఓటర్లు 16,05,762 ఉండగా అనుబంధ జాబితాల్లో చేర్చిన ఓటర్లతో కలిపి ఇప్పుడు వీరిసంఖ్య 16,23,149కి పెరిగింది.

గ్రామీణంలోనే అధికం: నియోజకవర్గాల వారీగా చూస్తే అత్యధికంగా రాజమహేంద్రవరం గ్రామీణంలో మొత్తం 2,72,170 మంది ఓటర్లు ఉండగా.. అత్యల్పంగా కొవ్వూరులో 1,83,235 మంది ఉన్నారు. అనపర్తిలో 2,24,233 మందికాగా రాజానగరంలో 2,14,549, రాజమహేంద్రవరం అర్బన్‌లో 2,61,956, నిడదవోలులో 2,11,842, గోపాలపురంలో 2,40,835 మంది చొప్పున ఉన్నారు.

మహిళలదే పైచేయి..: మొత్తం పురుష ఓటర్లు 7,92,317 కాగా మహిళా ఓటర్లు 8,30,735, ఇతరులు 97 మంది ఉన్నారు. తుది జాబితాతో పోలిస్తే రెండవ అనుబంధ జాబితా ప్రచురణ నాటికి కొత్తగా పెరిగిన ఓటర్లు పురుషులు 7,175, మహిళా ఓటర్లు 10,220 మంది ఉన్నారు. ఇతరులు మాత్రం ఎనిమిది మంది తగ్గారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని