logo

హోం ఓటింగ్‌కు 69 బృందాలు

పోలింగ్‌ కేంద్రాల వరకు రావాల్సిన అవసరం లేకుండా ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకునేలా 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40 శాతం వైకల్యంతో ఉన్న దివ్యాంగ ఓటర్లకు ఎన్నికల కమిషన్‌ హోం ఓటింగ్‌ అవకాశాన్ని కల్పించడంతో దీనికోసం మొత్తం 400 మంది ఎన్నికల సిబ్బందితో 69 బృందాలను ఏర్పాటు చేశారు.

Published : 29 Apr 2024 06:11 IST

మే 2, 8 తేదీల్లో ఇళ్లవద్దే ఓటుహక్కు వినియోగం
జిల్లావ్యాప్తంగా 1,306 మంది గుర్తింపు

రాజమహేంద్రవరం కలెక్టరేట్‌: పోలింగ్‌ కేంద్రాల వరకు రావాల్సిన అవసరం లేకుండా ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకునేలా 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40 శాతం వైకల్యంతో ఉన్న దివ్యాంగ ఓటర్లకు ఎన్నికల కమిషన్‌ హోం ఓటింగ్‌ అవకాశాన్ని కల్పించడంతో దీనికోసం మొత్తం 400 మంది ఎన్నికల సిబ్బందితో 69 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఆయా నియోజకవర్గాల్లో మే 2న తొలి విడతగా, 8న రెండవ విడతగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తాయి. ఫారం-12డి దరఖాస్తులు అందజేసిన వారి ఇళ్లకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తారు. దీనికి సంబంధించిన సమాచారం ముందుగానే తెలియజేస్తారు. ఆయా రోజుల్లోనే కచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాధవీలత తెలిపారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో 85 ఏళ్లు నిండిన వృద్ధ ఓటర్లు 8,294 మంది, 40 శాతం వైకల్యం కలిగిన దివ్యాంగ ఓటర్లు 19,754 మంది ఉన్నారు. ఇప్పటికే వీరికి హోంఓటింగ్‌ అవకాశం కల్పిస్తూ ఫారం-12డి పంపిణీ చేసినప్పటికీ ఎక్కువ మంది ఆసక్తి చూపడంలేదు. పూర్తిచేసిన దరఖాస్తులు 1,306 మందే అధికారులకు సమర్పించారు. వీరిలో 85 ఫ్లస్‌ వయసు వారు 648, దివ్యాంగ ఓటర్లు 658 మంది ఉన్నారు. వీరే మే 2, 8 తేదీల్లో ఇళ్లవద్ద ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరి ఇళ్లకు ప్రత్యేక బృందాలు వెళ్లి ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు సహకరిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని