logo

అంబటి.. తప్పు కదా?

వైకాపా నాయకులు తమ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరిస్తున్నారు. ప్రదేశంతో సంబంధం లేకుండా సీఎంకు భజన చేయడమే పనిగా పెట్టుకున్నారు. వారు చేస్తే ఎవరూ కాదనరు..

Updated : 08 Mar 2024 06:17 IST

విద్యార్థులతో సీఎం చిత్రాల ప్రదర్శన

నిడుబ్రోలు హైస్కూల్‌లో సీఎం జగన్‌ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న విద్యార్థులు.. మధ్యలో కూర్చున్న అంబటి మురళీకృష్ణ

పొన్నూరు, న్యూస్‌టుడే : వైకాపా నాయకులు తమ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరిస్తున్నారు. ప్రదేశంతో సంబంధం లేకుండా సీఎంకు భజన చేయడమే పనిగా పెట్టుకున్నారు. వారు చేస్తే ఎవరూ కాదనరు.. కానీ లోకం తెలియని చిన్నారులను ఇందులో భాగస్వాములను చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం నిడుబ్రోలు హైస్కూల్‌లో గురువారం బజరంగ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరాన్ని వైకాపా పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ  ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నేత్ర వైద్య పరీక్షలు చేశారు. అనంతరం అంబటి మురళీకృష్ణ విద్యార్థుల చేతికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోలు ఇచ్చి ప్లకార్డుల మాదిరిగా ప్రదర్శింపజేశారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. చదువు చెప్పాల్సిన పాఠశాలలో వైకాపా నేతలు రాజకీయం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని