Nara Lokesh: మంగళగిరిలో నారా లోకేశ్‌ నామినేషన్‌.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ

గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా నారా లోకేశ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.

Published : 18 Apr 2024 16:43 IST

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా నారా లోకేశ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన తరఫున తెదేపా, జనసేన, భాజపా నాయకులు నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి రాజకుమారికి సమర్పించారు. నామినేషన్‌ పత్రాల సమర్పణలోనూ లోకేశ్‌ అన్ని కులాలకు సమ ప్రాధాన్యత కల్పించారు. ఆయన తరఫున పత్రాలు సమర్పించిన వారిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లోకేశ్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామన్నారు. అంతకుముందు మంగళగిరి సీతారామ ఆలయంలో నామినేషన్‌ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పదివేల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని