logo

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది

న్యాయం చేయాలని అయిదు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేపడితే వైకాపా రాక్షస ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోపూరి శ్రీ లక్ష్మి ఆగ్రహం  వ్యక్తం చేశారు.

Published : 02 May 2024 06:46 IST

ప్రాణం ఉన్నంత వరకు దీక్ష కొనసాగిస్తా

దీక్షా శిబిరంలో శ్రీలక్ష్మి తదితరులు

గుంటూరు రూరల్‌, న్యూస్‌టుడే: న్యాయం చేయాలని అయిదు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేపడితే వైకాపా రాక్షస ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోపూరి శ్రీ లక్ష్మి ఆగ్రహం  వ్యక్తం చేశారు. వైకాపా నాయకుల అక్రమాలు, భూకబ్జాలకు వ్యతిరేకంగా గుంటూరులో శ్రీలక్ష్మి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవారం కొనసాగింది. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ భూకబ్జాలు, గంజాయి విక్రయాల అరికట్టటానికి ఎన్నో ఏళ్లగా ఇక్కడ పోరాటం సాగిస్తున్నానని తెలిపారు. మనుషులను చంపుతూ ఆ శవాలపై వైకాపా ప్రభుత్వం పాలన సాగిస్తుందని దుయ్యబట్టారు.జగన్‌ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. బాధితులకు న్యాయం చేయాలని ప్రాణం ఉన్నంతవరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. ఓ మహిళ వేలు కోసుకుని దీక్ష చేపడితే ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాడిశెట్టి మురళి మోహన్‌ అన్నారు. ఆమెను పరామర్శించి మాట్లాడారు. వందనాదేవి, కృష్ణ రేఖ ఆనంద్‌ కుమార్‌, పద్మావతి, విజయ, దేవి, యల్లమంద రావు తదితరులు శిబిరాన్ని సందర్శించి ఆమెకు మద్దతు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని