logo

అంకురాల ప్రోత్సాహానికి స్టార్టప్‌ మిక్సర్‌

అంకుర సంస్థలు ప్రారంభించాలన్న ఆలోచన ఉన్నా మనసును తొలిచే మొదటి ప్రశ్న పెట్టుబడి ఎలా? ఆ తర్వాత మార్కెటింగ్‌, బ్రాండింగ్‌ పెంచుకోవడం,

Published : 29 Apr 2024 04:34 IST

అంకుర ఆలోచనలతో వచ్చిన వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న మెంటార్‌

ఈనాడు, హైదరాబాద్‌: అంకుర సంస్థలు ప్రారంభించాలన్న ఆలోచన ఉన్నా మనసును తొలిచే మొదటి ప్రశ్న పెట్టుబడి ఎలా? ఆ తర్వాత మార్కెటింగ్‌, బ్రాండింగ్‌ పెంచుకోవడం, వ్యాపారాన్ని విస్తరించడం ఎలా? అంటూ అనేక ఆలోచనలు మెదులుతుంటాయి. సంస్థ ప్రారంభంలో కాస్త ఆలస్యమయినా అదేతరహా ఆలోచనలతో వచ్చే అంకుర సంస్థల పోటీని తట్టుకుని నిలబడటం ఎలా? ఈ క్రమంలోనే ‘నాంది వెంచర్స్‌’, ‘ఎడ్వెంచర్‌ పార్క్‌, ఎడోద్వజ, నోవేషన్‌ లెర్నింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా ‘స్టార్టప్‌ మిక్సర్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. నగరంలోని ఫౌండర్లు, ఇన్వెస్టర్లు, మెంటార్లను కలపడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. అవకాశాలు పెంపొందించుకునేలా ప్రతి అంశాన్ని ఇక్కడ సూక్ష్మంగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు రెండు ‘స్టార్టప్‌ మిక్సర్‌’ కార్యక్రమాలు జరగ్గా 250 మంది పాల్గొని తమ ఆలోచనలు పంచుకున్నారు. వచ్చే నెలలో మరో స్టార్టప్‌ మిక్సర్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.

అజెండా ఏమిటంటే..?

డీ రిస్కింగ్‌ యువర్‌ స్టార్టప్‌: అంకుర సంస్థకు సంబంధించి ఉత్పత్తుల వృద్ధి, వినియోగదారులను పెంచుకోవడం, మార్కెటింగ్‌ విశ్లేషణ, బృందంపై పెట్టే ఖర్చు తదితర అంశాలను వివరిస్తారు. ఫండింగ్‌ ఎప్పుడు తీసుకోవాలి? దేనికి వాడాలి అనేలా ప్రాధాన్యతలను వివరిస్తారు. 

స్ట్రాటజీ ఫర్‌ గ్రోత్‌, సీడ్‌: అంకుర సంస్థలను ఎలా అభివృద్ధి చేసుకోవాలి? సొంతంగా అభివృద్ధి చేసుకోవడం, ఇతరుల సహాయం ఎప్పుడు తీసుకోవాలి? వినియోగదారులకు మరింతగా ఏ విధంగా చేరువ కావాలి? అనే అంశాలను ఇందులో వివరిస్తారు.

నెగోషియేషన్స్‌ నింజా: మాస్టరింగ్‌ టర్మ్‌షీట్స్‌, ఫండ్‌ రైజింగ్‌ ఫర్‌ స్టార్టప్స్‌..ఆలోచన పంచుకున్న ఉత్పత్తుల అవసరం ఎంత ఉంది? ఎంత మేర మార్కెటింగ్‌ చేయగలుగుతుంది? అనే అంశాలను తెలియజేస్తారు.

నెట్‌వర్కింగ్‌, కొలాబొరేషన్స్‌, కో ఫౌండర్‌ మ్యాచ్‌: ఆలోచన, నిధులను సమకూర్చే వ్యక్తులను సహ వ్యవస్థాపకులుగా ఇందులో ఎంపిక చేసుకొనే అవకాశం ఉంటుంది.
ఓపెన్‌ మైక్స్‌ ఫర్‌ స్టార్టప్‌ ఫౌండర్స్‌: పలు ఆలోచనలతో వచ్చిన వారి అనుభవాలను పంచుకోవచ్చు.


క్రౌడ్‌ పిచింగ్‌...

వినూత్న ఆలోచనలను వెలికి తీయడమే ‘క్రౌడ్‌ పిచింగ్‌’ కార్యక్రమం ముఖ్యోద్దేశం. ఫౌండర్‌ ఫ్రైడే కార్యక్రమం రోజున హాజరయ్యే పలు సంస్థల వ్యవస్థాపకులు, భాగస్వాములు, వినూత్న ఆలోచనలతో వచ్చిన వారిని కలిపే వేదికగా ఇది పనిచేస్తుంది. కానీ క్రౌడ్‌ పిచింగ్‌లో తమ ఆలోచనలు, మార్కెటింగ్‌ అవకాశాలు, పరస్పర ప్రయోజనాలు, పెట్టుబడులు ఇతర అంశాలను కేవలం ఒక నిమిషంలో చెప్పాలనేది ప్రధాన నిబంధన. ఇలా హాజరైన ప్రతి ఒక్కరి ఆలోచనలను స్వీకరించి, ప్రాజెక్టు రిపోర్టులను పరిశీలిస్తారు. మెరుగైన ఆలోచనలు ఉన్న ప్రాజెక్టులకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని