logo

మోదీకి దివ్యాంగులు అండగా నిలవాలి

కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం పదేళ్ల వ్యవధిలో దివ్యాంగులకు అన్నిరకాలుగా చేయూతనందించిందని, ఈ నేపథ్యంలో వారంతా మరోసారి భాజపాకు అండగా నిలవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కోరారు.

Published : 30 Apr 2024 02:28 IST

మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి. చిత్రంలో ఎన్‌.గౌతంరావు తదితరులు

బర్కత్‌పుర, న్యూస్‌టుడే: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం పదేళ్ల వ్యవధిలో దివ్యాంగులకు అన్నిరకాలుగా చేయూతనందించిందని, ఈ నేపథ్యంలో వారంతా మరోసారి భాజపాకు అండగా నిలవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కోరారు. సోమవారం బర్కత్‌పురలోని నగర పార్టీ కార్యాలయంలో.. సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, దివ్యాంగుల ఉద్యోగ రిజర్వేషన్లను మోది ప్రభుత్వం 3 శాతం నుంచి 4 శాతానికి పెంచిందని గుర్తు చేశారు. భాజపా హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు ఎన్‌.గౌతంరావు మాట్లాడుతూ, సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో దివ్యాంగుల పరికరాలకు ఎంపీ నిధుల నుంచి రూ.పది కోట్లు వెచ్చించి వారికి అండగా నిలిచిన ఘనత కిషన్‌రెడ్డికి దక్కుతుందన్నారు. భాజపా దివ్యాంగుల విభాగం రాష్ట్ర కన్వీనర్‌ కొల్లి నాగేశ్వర్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పులిపాటి శ్రీనివాస్‌, మహంకాళి రవీందర్‌, యాదయ్య, దయామణి, వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని