logo

ఆభరణాలు అందాన్ని మరింత పెంచుతాయి: రాశీ ఖన్నా

మగువల అందాన్ని ఆభరణాలు రెట్టింపు చేస్తాయని ప్రముఖ సినీనటి రాశి ఖన్నా అన్నారు.

Updated : 18 May 2024 19:59 IST

హైదరాబాద్‌: మగువల అందాన్ని ఆభరణాలు రెట్టింపు చేస్తాయని ప్రముఖ సినీనటి రాశి ఖన్నా అన్నారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 లోని లుంబిని జ్యువెల్ మాల్‌లో ఉన్న మంగత్రయి నీరజ్ ఆధ్వర్యంలో శనివారం "వీనస్ - ద గాడెస్ ఆఫ్ ఎమరాల్డ్" పేరుతో ప్రత్యేక కలెక్షన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాశి ఖన్నా అక్కడ ఏర్పాటు చేసిన పలు ఆభరణాలను ధరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మన సంప్రదాయాలకు ఆధునికతను మేళవిస్తూ ఇక్కడ రూపొందించిన ఆభరణాలు తనకు ఎంతగానో నచ్చాయన్నారు. ప్రతి మహిళ ఆభరణాలను ధరించడానికి ఇష్టపడుతుందని అలాగే తనకు కూడా ఆభరణాలు ధరించడం ఇష్టమన్నారు. కార్యక్రమంలో భాగంగా పలువురు మోడల్స్ నగలను ధరించి సందడి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని