logo
Published : 29/11/2021 06:39 IST

వాగుల వద్ద బందోబస్తు


సిబ్బందికి సూచనలు చేస్తున్న ఏఆర్‌ అదనపు ఎస్పీ మహేష్‌కుమార్‌

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : జిల్లాలో భారీ వర్షాల కురుస్తుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వాగులు, వంకలు, చెరువులు, కుంటల వద్ద పోలీసులను బందోబస్తు ఉంచారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో రాకపోకలను నిషేధించారు. ఊటుకూరు చెరువు వద్ద తాలూకా సీఐ నాగభూషణం సిబ్బందితో నిఘా ఉంచారు. ముందుజాగ్రత్త చర్యగా పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఏఆర్‌ అదనపు ఎస్పీ మహేష్‌కుమార్‌, డీఎస్పీ వెంకటశివారెడ్డి ఆధ్వర్యంలో బుగ్గవంక జలాశయాన్ని పరిశీలించారు. ప్రాజెక్టు డీఈతో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాధారణ స్థాయిలోనే నీటి నిల్వలు ఉన్నాయని, ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని