logo

66.44 శాతమే అధికం

మొదటి రెండు పర్యాయాలు కరీంనగర్‌ ద్విసభ్య నియోజకవర్గ పరిధిలో ఉన్న పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి 1962 నుంచి విడిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 16 విడతల్లో ఎన్నికలు జరిగినా ఎప్పుడూ 67 శాతానికి మించి పోలింగ్‌ నమోదు కాలేదు.

Published : 28 Apr 2024 05:36 IST

పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో పోలింగ్‌ అంతంతే

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌ : మొదటి రెండు పర్యాయాలు కరీంనగర్‌ ద్విసభ్య నియోజకవర్గ పరిధిలో ఉన్న పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి 1962 నుంచి విడిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 16 విడతల్లో ఎన్నికలు జరిగినా ఎప్పుడూ 67 శాతానికి మించి పోలింగ్‌ నమోదు కాలేదు. ఎప్పటికప్పుడు అధికారులు చైతన్యం తెస్తున్నా ఓటేయడానికి జనం ఆసక్తి చూపడం లేదు. తొలి ఎన్నికల్లో 55.42 పోలింగ్‌ శాతం నమోదైంది. 2014 ఎన్నికల్లో నమోదైన 66.44 శాతమే ఇప్పటివరకు అత్యధికం.

గత ఎన్నికల్లో మహిళా చైతన్యం : నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో అత్యధిక మహిళా ఓటర్ల పోలింగ్‌ నమోదైంది. 1952 నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే తొలిసారిగా గత ఎన్నికల్లో అతివలు అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అప్పట్లో మొత్తం 14,78,062 మంది ఓటర్లున్నారు. 7,39,633 మంది పురుషుల్లో 4,83,726 మంది, 7,38,346 మంది మహిళల్లో 4,84,059 మంది ఓటేశారు. నియోజకవర్గంలో పురుష ఓటర్ల సంఖ్యే అధికంగా ఉన్నా ఓటు హక్కు వినియోగంలో మహిళలే ముందు వరుసలో నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని