logo

ఆసుపత్రిలో చేరిన కృష్ణ

మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ (91)కు ఆరోగ్య సమస్యలు తిరగబెట్టాయి.

Published : 30 Apr 2024 01:34 IST

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ (91)కు ఆరోగ్య సమస్యలు తిరగబెట్టాయి. ఇటీవలే ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి వైద్యసేవలు పొంది, ఇంటికి చేరుకున్నారు. సోమవారం మరోసారి ఇబ్బందులు ఎదురైన క్రమంలో చికిత్స కోసం మణిపాల్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ నెల 22న జ్వరం, దగ్గుతో ఇబ్బంది పడుతూ మల్య రోడ్డులోని వైదేహి ఆసుపత్రిలో మూడు రోజులు చికిత్స పొందడం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని