logo

తెలుగు రాష్ట్రాలకు ఓటర్ల పయనం

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఓటు హక్కు ఉన్న వారు బెంగళూరు నుంచి శుక్రవారం సాయంత్రం తమ నియోజకవర్గాలకు పయనమయ్యారు. భద్రత కోసం పోలీసులు, హోం గార్డులకు ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచింది.

Published : 11 May 2024 01:35 IST

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఓటు హక్కు ఉన్న వారు బెంగళూరు నుంచి శుక్రవారం సాయంత్రం తమ నియోజకవర్గాలకు పయనమయ్యారు. భద్రత కోసం పోలీసులు, హోం గార్డులకు ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచింది. బసవజయంతికి శుక్రవారం సెలవు కాగా, రెండో శనివారం, ఆదివారం వరుస సెలవులు ఉన్నాయి. సోమవారం సెలవు తీసుకుని ఆయా కంపెనీల ఉద్యోగులు తమ ఊళ్లకు వెళ్లారు. కొందరు గురువారం రాత్రే నగరం విడిచి వెళ్లారు. విశాఖ, విజయనగరం, కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లవలసిన వారే ఎక్కువ మంది తమ ప్రాంతాలకు వెళ్లగా, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, విజయవాడ, గుంటూరుకు వెళ్లేందుకు ఆదివారం రాత్రికి బస్సు టికెట్లు బుక్‌ చేసుకున్నారు. ఈ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రైవేట్ ట్రావెల్స్‌తో పాటు కేఎస్‌ ఆర్టీసీ కూడా ఆదివారం అదనపు బస్సులను సమకూర్చింది. కేఎస్‌ఆర్టీసీ కర్ణాటకలో కొన్ని సర్వీసులను రద్దు చేసి, ఆంధ్రప్రదేశ్‌కు నడిపేందుకు చర్యలు తీసుకుందన్నారు. కర్ణాటక సరిహద్దులలోని నియోజకవర్గాల ఓటర్లు బృందంగా బస్సులు, టెంపో ట్రావెలర్‌ బుక్‌ చేసుకుని వెళ్లేందుకు సన్నాహాలు చేసుకున్నారు. బెంగళూరుతో పాటు తుమకూరు, చిత్రదుర్గ, బళ్లారి, రాయచూరు, బీదర్‌ తదితర ప్రాంతాల్లో ఉంటున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన వారు కూడా ఈసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమ నియోజకవర్గాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని