logo

‘మంత్రి కొడాలి నానిని బర్తరఫ్‌ చేయాలి’

కొడాలి నానిని మంత్రి పదవినుంచి బర్తరఫ్‌ చేయాలని భాజపా నాయకులు డిమాండ్‌ చేశారు. గుడివాడ వెళ్తున్న భాజపా రాష్ట్ర నాయకులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ గురువారం పార్టీ నాయకులు నూకల శేషయ్యనాయుడు ఆధ్వర్యంలో నగరంలో

Published : 28 Jan 2022 02:17 IST

నిరసనలో భాజపా నాయకులు

మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే: కొడాలి నానిని మంత్రి పదవినుంచి బర్తరఫ్‌ చేయాలని భాజపా నాయకులు డిమాండ్‌ చేశారు. గుడివాడ వెళ్తున్న భాజపా రాష్ట్ర నాయకులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ గురువారం పార్టీ నాయకులు నూకల శేషయ్యనాయుడు ఆధ్వర్యంలో నగరంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పాల్గొన్న పార్టీ నాయకులు మాట్లాడుతూ సంప్రదాయంగా నిర్వహించుకునే సంక్రాంతి పండుగ సమయంలో క్యాసినో నిర్వహించినవారిపై విచారణ చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి శంకరయ్య పద్మజ, ఎం.రాము, రాంబాబు, మత్తి వెంకటేశ్వరరావు, అంజనా దేవి వెన్నా ఫణి, బొడ్డు సునీల్‌, వెన్నా ఫణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని