ఒకే ఫ్రేమ్‌లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్‌

ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా (Harsh Goenka) నెట్టింట మరో ఫన్నీ పోస్టు పెట్టారు. అలాగే ఆయన షేర్ చేసిన చిత్రం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. 

Published : 11 May 2024 00:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా (Harsh Goenka) సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు నెటిజన్లను ఆకట్టుకుంటాయి. తాజాగా ఆయన ఒక పాత ఫొటోను రీపోస్టు చేసి, జత చేసిన ఫన్నీ కామెంట్‌ నవ్వులు పూయిస్తోంది. ఆ ఫ్రేమ్‌లో భారత్‌కు చెందిన ముగ్గురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఉన్నారు.

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ హర్ష గోయెంకా ఆ చిత్రంలో దర్శనమిచ్చారు. ఏదో విషయమై ముగ్గురు చర్చించుకోవడం అందులో కనిపిస్తోంది. దీనిని ఒక ఫొటో జర్నలిస్టు తన ఖాతాలో షేర్ చేయగా..అది కాస్తా గోయెంకా దృష్టిలోపడింది. వెంటనే ఆయన దానిని రీపోస్టు చేస్తూ ఒక కామెంట్ పెట్టారు. ‘‘ఆ ముగ్గురు స్నేహితుల్లో ఒకరు బ్యాలెన్స్ షీట్ సైజ్‌లో నంబర్‌ వన్. ఇంకొకరు గౌరవంపరంగా నంబర్‌ వన్‌. మరొకరు మాత్రం తన నడుము సైజ్‌లో నంబర్‌ వన్‌’’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌ మారింది. కొందరు ఆయన హాస్యచతురతను మెచ్చుకుంటూ బదులిచ్చారు. ‘‘సైజ్‌ లేక విజయం ఏదైనా కావొచ్చు.. స్నేహితులు స్నేహితులే. వారిని ఎవరూ భర్తీ చేయలేరు’’ అని స్పందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని