logo

కల్తీ విత్తనాలు, స్థిరాస్తి వ్యాపారులను ఓడించాలి

నంద్యాలలో నకిలీ విత్తనాలు, స్థిరాస్తి వ్యాపారం చేస్తూ ప్రజలను మోసగిస్తున్న ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డిలను ఓడించాలని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు.

Published : 29 Apr 2024 02:30 IST

మాట్లాడుతున్న బైరెడ్డి రాజశేఖరరెడ్డి

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : నంద్యాలలో నకిలీ విత్తనాలు, స్థిరాస్తి వ్యాపారం చేస్తూ ప్రజలను మోసగిస్తున్న ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డిలను ఓడించాలని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు. సంగమేశ్వరం వద్ద కృష్ణానదిపై తీగల వంతెన బదులు వంతెనతో కూడిన బ్యారేజి నిర్మించాలని డిమాండ్‌ చేస్తున్నా జగన్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్‌లో కౌన్సిలర్‌ శ్యాంసుందర్‌లాల్‌ ఆధ్వర్యంలో ఆదివారం తెదేపాకు మద్దతుగా వివిధ వర్గాలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ పోచా నకిలీ విత్తనాలతో ఎందరో రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యారని ఆరోపించారు. జగన్‌ కోసం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు ఎదురుచూస్తోందన్నారు. నంద్యాల తెదేపా ఎంపీ అభ్యర్థి డా.బైరెడ్డి శబరి మాట్లాడుతూ.. తనను ఎంపీగా గెలిపిస్తే మాజీ ఎంపీ పెండెకంటి వెంకటసుబ్బయ్యను ఆదర్శంగా తీసుకుని ఆర్యవైశ్యులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్‌ఎండీ ఫరూక్‌ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే వారిని గెలిపించాలని కోరారు. మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి,  తెదేపా రాష్ట్ర కార్యదర్శులు తులసిరెడ్డి, ఏవీఆర్‌ ప్రసాద్‌, కుడా మాజీ ఛైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆర్‌ఐసీ మాజీ ఛైర్మన్‌ ఏవీ సుబ్బారెడ్డి, తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌, భాజపా నాయకులు డా.ఇంటి ఆదినారాయణ, మేడా మురళీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని