logo

కానిస్టేబుళ్లపై విచారణకు డీఐజీ ఆదేశం

ఆర్థికమంత్రి బుగ్గన నామినేషన్‌ బందోబస్తుకు వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్లపై విచారణకు డీఐజీ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 22న బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నామినేషన్‌కు ఆవుకు పోలీస్‌స్టేషన్‌ నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లు బందోబస్తు నిమిత్తం డోన్‌కు వచ్చారు.

Published : 29 Apr 2024 02:32 IST

డోన్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే: ఆర్థికమంత్రి బుగ్గన నామినేషన్‌ బందోబస్తుకు వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్లపై విచారణకు డీఐజీ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 22న బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నామినేషన్‌కు ఆవుకు పోలీస్‌స్టేషన్‌ నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లు బందోబస్తు నిమిత్తం డోన్‌కు వచ్చారు. నామినేషన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత తిరిగి అవుకుకు వెళ్తుండగా...ప్యాపిలి మండలంలోని రాచర్ల సమీపంలో అలేబాదుతాండాకు చెందిన బీమ్లానాయక్‌ ఆటోలో అక్రమంగా మద్యం తరలిస్తుండగా..వారు ఆటోను గుర్తించి పట్టుకున్నారు. కాసులకు కక్కుర్తిపడి రూ.30 వేలు డిమాండ్‌ చేయగా...రూ.20 వేలకు బేరం కుదిరింది. బాధితుడు పోలీసులకు ఫోన్‌పే ద్వారా రూ.20 వేలు పంపాడు. దీని ఆధారంగా బాధితుడు డీఐజీకి ఫిర్యాదు చేయగా డోన్‌ డీఎస్పీ శ్రీనివాసరెడ్డికి విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని