logo

పశ్చిమాన వలస విలాపం

పశ్చిమాన పల్లెలు కన్నీరు పెడుతున్నాయి.. వలస వెళ్తున్న ప్రజలను చూసి. ఇళ్లకేసిన తలుపులు, తాళాలు ప్రశ్నిస్తున్నాయి.. మళ్లీ ఎప్పుడు తీస్తారని. ఇంటికి కాపలా ఉన్న పెద్దలు ఎదురు చూస్తున్నారు.. అయినవాళ్లు ఎప్పుడు తిరిగొస్తారని.

Updated : 29 Apr 2024 08:11 IST

ఆస్పరి మండలం బిణిగేర, పత్తికొండ మండలం అటికెలగుండుకు చెందిన కుటుంబాలు హైదరాబాద్‌కు పయనం

ఈనాడు, కర్నూలు: పశ్చిమాన పల్లెలు కన్నీరు పెడుతున్నాయి.. వలస వెళ్తున్న ప్రజలను చూసి. ఇళ్లకేసిన తలుపులు, తాళాలు ప్రశ్నిస్తున్నాయి.. మళ్లీ ఎప్పుడు తీస్తారని. ఇంటికి కాపలా ఉన్న పెద్దలు ఎదురు చూస్తున్నారు.. అయినవాళ్లు ఎప్పుడు తిరిగొస్తారని. అమ్మానాన్నకు దూరంగా ఉంటున్న చిన్నారులు అడుగుతున్నారు.. మా ఒంటరితనం తీరేదెన్నడని. నెర్రలిచ్చిన పొలాలు బోరుమంటున్నాయి.. తడిసేది ఎప్పుడని.. సాగు సాగేనా అని. పశ్చిమ పల్లెలకు వలస తిప్పలు తప్పడం లేదు. మూటాముల్లె సర్దుకుని.. పొట్టచేతపట్టుకుని.. పట్టణాలకు పయనమవుతున్నారు. ఇళ్ల వద్ద వృద్ధులు, పిల్లలను ఉంచి వెళ్తున్నారు. ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, ఆస్పరి, కోసిగి, మంత్రాలయం తదితర మండలాల నుంచి వేలమంది వలసబాట పట్టారు. పంటలు ఎండిపోయి.. అప్పులు తడిమోపెడయ్యాయి. బతుకు భారంగా మారింది. చెమ్మగిల్లిన కళ్లతో సొంత ఊళ్లను వదిలి వెళ్తున్నారు.

వీధులు నిర్మానుషం: మంత్రాలయం మండలం మాలపల్లెలో మనుషులు కరవు


తుంగాతీరం.. సాగు భారం: సీబెళగల్‌ మండలంలో తుంగభద్ర నది పరీవాహక ప్రాంతంలో ఎండిపోయి నెర్రలిచ్చిన వరి పొలం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని