logo

గూడ్స్‌ బోగిలో మంటలు

గుంతకల్లు రైల్వే డివిజన్‌ పరిధిలోని చిప్పగిరి మండలం నేమకల్లు రైల్వే స్టేషన్‌లో ఆదివారం గూడ్స్‌ బోగిలో మంటలు చెలరేగాయి. రైల్వే సిబ్బంది వెంటనే అగ్ని మాపక శాఖ వారికి సమాచారం అందించారు.

Published : 29 Apr 2024 02:55 IST

నేమకల్లు రైల్వే స్టేషన్‌లో గూడ్స్‌ బోగి నుంచి వస్తున్న పొగలు

న్యూస్‌టుడే, చిప్పగిరి: గుంతకల్లు రైల్వే డివిజన్‌ పరిధిలోని చిప్పగిరి మండలం నేమకల్లు రైల్వే స్టేషన్‌లో ఆదివారం గూడ్స్‌ బోగిలో మంటలు చెలరేగాయి. రైల్వే సిబ్బంది వెంటనే అగ్ని మాపక శాఖ వారికి సమాచారం అందించారు. వారు వచ్చి మంటలను అదుపు చేశారు. నేమకల్లు రైల్వే స్టేషన్‌లో 14 బోగిల్లో బొగ్గును నిల్వ చేసి ఉంచారు. అందులోని ఒక బోగిలో నుంచి ఆదివారం దట్టమైన పొగలు వచ్చాయి. స్టేషన్‌ మాస్టరు ముజేష్‌ కుమార్‌ గుంతకల్లు రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారు అగ్నిమాపక సిబ్బంది, విద్యుత్తు శాఖ, టెక్నికల్‌ సిబ్బంది శ్రమించి ఇతర బోగీలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. స్టేషన్‌లోని రెండు వరుసల్లో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. దీంతో గుంతకల్లు-ముంబయి మార్గంలో రైళ్లు, గూడ్సులు ఆలస్యంగా నడిచాయి. రోజుల తరబడి బొగ్గు లోడుతో నిలపడంతో.. అధిక ఉష్ణోగ్రతలతో నిప్పంటుకుందని సిబ్బంది తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని