logo

వంతెనలు కూలుతున్నా.. కునుకు వీడరా!

వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు అని చెప్పడానికి ఈ చిత్రాలే నిదర్శనం. వంకలు, నదులపై నిర్మించిన వంతెనలు, కల్వర్టులు దెబ్బతిన్నా జగన్‌ ఐదేళ్ల పాలనలో కనీసం వాటి మరమ్మతుకు అడుగు ముందుకు పడలేదు.

Updated : 30 Apr 2024 00:52 IST

వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు అని చెప్పడానికి ఈ చిత్రాలే నిదర్శనం. వంకలు, నదులపై నిర్మించిన వంతెనలు, కల్వర్టులు దెబ్బతిన్నా జగన్‌ ఐదేళ్ల పాలనలో కనీసం వాటి మరమ్మతుకు అడుగు ముందుకు పడలేదు. దీంతో ఆ దారిలో రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రజలు భయంభయంగా ప్రయాణం సాగించాల్సి వస్తోంది.

న్యూస్‌టుడే, బృందం


చెప్పినా పట్టించుకోరు:

బండిఆత్మకూరులో కుందూనదిపై నిర్మించిన వంతెన కింది భాగంలోని పిల్లర్లు దెబ్బతిన్నాయి. ఈ వంతెనను గత 30 సంవత్సరాల కిందట నిర్మించారు. అప్పటి నుంచి ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదు. సమస్యను సంబంధిత అధికారులకు చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్థులు పేర్కొంటున్నారు.


రక్షణ జాతీయం

ఆళ్లగడ్డ, గ్రామీణం: బత్తలూరు-యర్రగుడిదిన్నె మధ్య 40వ జాతీయ రహదారిపై ఉన్న వంతెనకు రక్షణ గోడ ధ్వంసమైంది. వేగంతో వెళ్లే వాహనాలు ప్రమాదాల బారిన పడే అవకాశముంది.


నేటికీ బ్రిటిష్‌ పాలనే..:

దేవనకొండ: కర్నూలు-బళ్లారి రహదారిలోని అలారుదిన్నె సమీపంలోని వంతెనను 1940లో బ్రిటిష్‌ వారు రూ.1.25లక్షలతో నిర్మించారు. వంతెన రక్షణ గోడలు శిథిలావస్థకు చేరాయి.


ప్రయాణం.. తప్పని అంతరాయం:

కొత్తపల్లి: దుద్యాల గ్రామ సమీపంలోని వంతెనకు రక్షణ గోడలు లేవు. వంతెన ఎత్తు తక్కువగా ఉండటంతో వర్షం వస్తే రహదారిపై నీరు ప్రవహిస్తుంది.


చినుకు పడితే.. వణుకే:

ఆత్మకూరు: ఆత్మకూరు-కొత్తపల్లికి వెళ్లే దారిలో వంతెన ఎత్తు తక్కువగా ఉండటంతో వర్షాలు కురిసినప్పుడు నీరు వంతెనపై ప్రవహిస్తుంది. ఆ దారిలో రాకపోకలు నిలిచిపోతున్నాయి.


పట్టించుకోని సర్కారు:

మద్దికెర-పత్తికొండ రహదారిలో బురుజుల వద్ద నిర్మించిన ప్రధాన వంతెనకు ఇరువైపులా వేసిన మట్టి పూర్తిగా కోతకు గురైంది. ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో పలువురు వాహనచోదకులు ప్రమాదాలకు గురయ్యారు.


నాలుగేళ్లుగా ఇంతే.. :

బురుజుల-హోసూరు మధ్య ఉన్న కల్వర్టు శిథిలమై నాలుగేళ్లు గడిచింది. ఆర్‌అండ్‌బీ అధికారులు తాత్కాలిక మరమ్మతు పేరుతో మట్టివేసి పూడ్చేశారు. భారీ వర్షం కురిసిన ప్రతిసారి వాగు పొంగి రహదారిపైకి వరద నీరు వస్తోంది.


పొంచి ఉన్న ప్రమాదం:

పత్తికొండ గ్రామీణం: చిన్నహుల్తి సమీపంలోని హంద్రీవాగుపై ఉన్న పురాతన వంతెన రక్షణ గోడలు దెబ్బతిన్నాయి. ఈ దారిలో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు    సాగిస్తుంటాయి. మలుపు గమనించని వాహనాలు వాగులో పడే ప్రమాదముంది.  


చోద్యం చూస్తున్నారు:

మంత్రాలయం గ్రామీణం: కౌతాళం మండలంలోని హాల్వి వద్ద కోసిగి రహదారిలో ఉన్న వంతెనకు రెండు వైపులా రక్షణ గోడలు లేకపోవడంతో వాహనాల రాకపోకలకు ప్రమాదకరంగా మారింది.


దెబ్బతిన్నా.. వదిలేశారు:

నంద్యాల బొమ్మలసత్రం: టంగుటూరు -బనగానపల్లికి వెళ్లే దారిలో అప్పలాపురం వద్ద దెబ్బతిన్న వంతెన.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని