logo

ఉమ్మడి జిల్లా ఓటర్లు 34,48,38211

ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలు 34,48,382 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం గురువారం వెల్లడించింది. అందులో పురుషులు 16,98,607, మహిళలు 17,49,199, ఇతరులు 576 మంది ఉన్నారు.

Published : 03 May 2024 04:23 IST

నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లదే ఆధిక్యం

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలు 34,48,382 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం గురువారం వెల్లడించింది. అందులో పురుషులు 16,98,607, మహిళలు 17,49,199, ఇతరులు 576 మంది ఉన్నారు. 14 నియోజకవర్గాల పరిధిలో పదకొండింటిలో మహిళా ఓటర్లు అధికంగా ఉండటం విశేషం. పురుష ఓటర్లతో పోలిస్తే 50,592 మంది మహిళా ఓటర్లదే పైచేయిగా నిలిచింది. పాణ్యం నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా 3.32 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కర్నూలు 2,74,557, నంద్యాల నియోజకవర్గాలు 2,74,446 మంది ఓటర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అత్యల్పంగా మంత్రాలయంలో 2.08 లక్షల ఓటర్లు ఉన్నారు.

జిల్లాలోని  పత్తికొండ, కోడుమూరు, ఆలూరులో పురుష ఓటర్లు, కర్నూలు, పాణ్యం, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. కర్నూలులో 8,814, పాణ్యం 8,714, ఎమ్మిగనూరు 3,447, మంత్రాలయం 3,966, ఆదోనిలో 2,179 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. పత్తికొండలో 51, కోడుమూరు 478, ఆలూరులో 1,484 మంది పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని