logo

వేసవి శిబిరాలు.. విజ్ఞాన వీచికలు

వేసవి సెలవులంటే.. చుట్టాల ఇళ్లు, విహారయాత్రలకు వెళ్లడం పరిపాటే. కొందరు ప్లిలలు మాత్రం విజ్ఞానం, నైపుణ్య అంశాలను పెంచుకోవాలని పరితపిస్తుంటారు.

Published : 30 Apr 2024 03:59 IST

సద్వినియోగంతో సత్ఫలితం 

వేసవి సెలవులంటే.. చుట్టాల ఇళ్లు, విహారయాత్రలకు వెళ్లడం పరిపాటే. కొందరు ప్లిలలు మాత్రం విజ్ఞానం, నైపుణ్య అంశాలను పెంచుకోవాలని పరితపిస్తుంటారు. నచ్చిన రంగంలో ఆసక్తి చూపుతూ.. అవసరమైన శిక్షణ పొందుతుంటారు. అలాంటి వారికి ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో పలు స్వచ్ఛంద సంస్థలు శిబిరాలను ఏర్పాటుచేశాయి. సద్వినియోగం చేసుకుంటే ఫలితం దక్కనుంది. వేసవి నేపథ్యంలో ప్రత్యేకంగా కొనసాగిస్తున్న, ఏర్పాటు కానున్న శిబిరాలపై ‘న్యూస్‌టుడే’ కథనం.

 బాల సంస్కార్‌

  • సిద్దిపేటలోని షిర్డీ సాయిబాబా ఆలయ ప్రాంగణం
  • ఉదయం 8.30 - 12.30 గంటలు

ఈ నెల 25న షురూ కాగా, మే 14 వరకు కొనసాగనుంది. 15 అంశాలు నేర్పనున్నారు. యోగా, చిత్రలేఖనం, అబాకస్‌, నీతి కథలు, శ్లోకాలు, ఆటపాటలు, సృజనాత్మక నైపుణ్యాలు, ఇతిహాస పురాణాలు, తదితర అంశాలు చెబుతున్నారు. 5-16 ఏళ్లలోపు వారికి అవకాశం కల్పించగా.. 140 మంది హాజరవుతున్నారు. తోట సంధ్య నేతృత్వంలో మూడేళ్లుగా నిర్వహిస్తున్నారు.


కూచిపూడి నృత్యం

  • సిద్దిపేటలో గోల్డెన్‌ బేకరీ వెనుక వైపు ఎన్‌సీఆర్‌ హాస్టల్‌ ఎదురుగా..
  • సాయంత్రం 5.30 - 7 గంటల వరకు

మే 1న ప్రారంభమై జూన్‌ 5వ తేదీ వరకు కొనసాగనుంది. కూచిపూడిలో ప్రాథమిక అంశాలపై తర్ఫీదు అందించనున్నారు. అడుగులు, ముద్రికలు, శ్లోకాలపై సాధన చేయిస్తారు. శిక్షకురాలు డా. గోనె మౌనిక నేతృత్వంలో శిక్షణ కొనసాగనుంది.


సంగీత శిక్షణ శిబిరం

  •  సిద్దిపేట మోహినిపురా వెంకటేశ్వర ఆలయం వద్ద వికాస తరంగిణి భవనం
  •  ఉదయం 8.30-10 గంటలు

అన్నమాచార్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి మొదలైన శిబిరం మే 10 వరకు కొనసాగనుంది. అన్నమయ్య పవన్‌ నేతృత్వంలో వాగ్గేయకారుల కీర్తనలు, స్త్రోత్రాలు, శోక్లాలు, శాస్త్రీయ సంగీతం నేర్పిస్తున్నారు.


చేతిరాత శిక్షణ

  •  సిద్దిపేట పీఆర్టీయూ భవన్‌ (పాత కలెక్టరేట్‌ సమీపంలో)
  •   ఉదయం 8-11 గం. వరకు..

ఈ నెల 26 నుంచి మే 5 వరకు కొనసాగుతుంది. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో చేతిరాతతో పాటు చిత్రలేఖనం, తెలుగు పద్యాలు, హిందీ దోహాలు, నీతి కథలు, దేశభక్తి గేయాలు, సంస్కృత శ్లోకాలను నేర్పిస్తున్నారు. శిక్షకుడు ఎజాస్‌అహ్మద్‌ 60 మందికి తర్ఫీదు ఇస్తున్నారు. 1995 నుంచి ఏటా వేసవిలో శిబిరాలు నిర్వహిస్తున్నారు.


సృజనాత్మకత, కళానైపుణ్యం

  •  జహీరాబాద్‌లోని శ్రామిక్‌ విజ్ఞాన కేంద్రం
  •  ఉదయం 9 - 12 గంటల వరకు

ఈ నెల 24 షురూ కాగా, మే 26 వరకు శిబిరం కొనసాగనుంది. పిల్లల జాతర పేరిట జహీరాబాద్‌, కోహీర్‌, మొగుడంపల్లి మండలాల్లోని 14 గ్రామాల్లో వీటిని ఏర్పాటుచేశారు. ఒక్కో శిబిరంలో 30-40 మంది వరకు ఉన్నారు. ఆట పాటలతో  బోధన, మట్టి, కాగితాలతో బొమ్మల తయారీ నేర్పిస్తున్నారు.


చిత్రలేఖనం

  • సిద్దిపేటలోని కోమటిచెరువు వద్ద రుస్తుం ఆర్ట్‌ గ్యాలరీ
  • ఉదయం 9 - 10 గంటల వరకు

మే 2 నుంచి 12వరకు శిబిరం కొనసాగనుంది. నైరూప్య చిత్రకారుడు నహీం రుస్తుం సారథ్యంలో చిత్రలేఖనంలో భాగంగా కలరింగ్‌, డ్రాయింగ్‌, మోడ్రన్‌ ఆర్ట్‌, పోర్టరైట్‌, ల్యాండ్‌స్కేప్‌ తదితర అంశాలపై నేర్పించనున్నారు.


బ్యాడ్మింటన్‌

  • రామాయంపేట ఇండోర్‌ స్టేడియం
  • ఉదయం, సాయంత్రం

మే 1 నుంచి జూన్‌ 5 వరకు కొనసాగనుంది. పోలీసుల సహకారంతో రామాయంపేట బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మెలకువలు నేర్పించనున్నారు. 14 ఏళ్లలోపు బాల, బాలికలకు అవకాశం ఉంటుంది.


స్పోకెన్‌ ఇంగ్లీషు

  • నర్సాపూర్‌ బీవీఆర్‌ఐటీ కళాశాలలో..
  • ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు

సోమవారం తరగతులు మొదలయ్యాయి. 6 నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు అర్హులు. నర్సాపూర్‌ ఎంపీపీ కార్యాలయం నుంచి కళాశాల వరకు ఉచిత బస్సు సౌకర్యం సైతం కల్పించారు.


క్రికెట్‌

  • సిద్దిపేటలోని క్రీడా మైదానం
  • ఉదయం 6-9 గంటల వరకు..

​​​​​​​ఈ నెల 20న మొదలైన శిబిరం మే 20 వరకు కొనసాగనుంది. హెచ్‌సీఏ, జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మరోవైపు జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏటా శిబిరాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం నిత్యం 150 మందికి పైగా హాజరవుతున్నారు. నిర్వాహకుడు మల్లికార్జున్‌ నేతృత్వంలో శిక్షకులు సాధన చేయిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని