logo

రాహుల్‌గాంధీని ప్రధానిని చేస్తే పేదలకు మేలు

కాంగ్రెస్‌ అధినాయకుడు రాహుల్‌గాంధీని ప్రధానిగా చేస్తేనే పేదల సమస్యలు తీరుతాయని అరుణాచల్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నభమ్‌ తూకి అన్నారు. మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చండూరు మండలంలోని జోగిగూడెం, తిమ్మారెడ్డిగూడెంలలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Published : 17 Nov 2023 02:34 IST

అరుణాచల్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నభమ్‌ తూకి

చండూరు మండలం తిమ్మారెడ్డిగూడెంలో కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న అరుణాచల్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నభమ్‌ తూకి

చండూరు, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ అధినాయకుడు రాహుల్‌గాంధీని ప్రధానిగా చేస్తేనే పేదల సమస్యలు తీరుతాయని అరుణాచల్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నభమ్‌ తూకి అన్నారు. మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చండూరు మండలంలోని జోగిగూడెం, తిమ్మారెడ్డిగూడెంలలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో భాజపా ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపి పేదల నడ్డి విరిచిందని విమర్శించారు. భాజపాను, తెలంగాణలో భారాసను గద్దె దింపేందుకు కాంగ్రెస్‌తో కలిసి పని చేయాలని ప్రజలను కోరారు. ఇక్కడి కాంగ్రెస్‌ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి తనకు ప్రియమిత్రుడని తెలిపారు. అతను చైనా, మయన్మార్‌, భూటాన్‌ దేశాల సరిహద్దులో సైనికుల కోసం 250 కిలోమీటర్ల రోడ్డును నిర్మించాడని చెప్పారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర మహిళలు తయారు చేసిన చేనేత జర్కిన్‌, మఫ్లర్‌ను రాజగోపాల్‌రెడ్డికి బహూకరించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాష్‌నేత, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని