logo

సాగు ప్రణాళిక ఖరారు.. విత్తనాలకు ప్రతిపాదనలు

నల్గొండ జిల్లా వానాకాలం పంటల సాగుపై వ్యవసాయశాఖ దృష్టి సారించింది. సాగును అంచనా వేసి అవసరమైన విత్తనాలు కోసం జిల్లాలో ప్రణాళిక సిద్ధం చేసింది.

Published : 29 Apr 2024 04:38 IST

గత వానాకాలంలో వరి నాట్లు వేస్తున్న కూలీలు

నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే: నల్గొండ జిల్లా వానాకాలం పంటల సాగుపై వ్యవసాయశాఖ దృష్టి సారించింది. సాగును అంచనా వేసి అవసరమైన విత్తనాలు కోసం జిల్లాలో ప్రణాళిక సిద్ధం చేసింది. విత్తనాలకు రాయితీ ప్రతిపాదనలు తయారు చేసి సర్కారుకు వ్యవసాయ శాఖ పంపింది. ఇప్పటికే ధాన్యం విక్రయాలు జోరందుకున్నాయి. కొనుగోళ్లు పూర్తి కాగానే రైతులు వానాకాలం సాగు పనుల్లో నిమగ్నం అవుతారు. యాసంగిలో ప్రతికూల పరిస్థితులను అధిగమించి వానాకాలం సాగుకు సమాయత్తం అవుతున్నారు. పొలాల్లో చెరువు మట్టి ట్రాక్టర్లలో తీసుకెళ్లి చల్లుతున్నారు. వ్యవసాయశాఖ కూడా ముందస్తుగా సమాయత్తం అవుతుంది. నకిలీ పత్తి విత్తనాలు నిరోధించే దిశగా అధికారులు దృష్టి సారించారు. సాధారణం కంటే అధికంగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది. గత ఏడాది వానాకాలం సీజన్‌ స్థితిగతులు, మార్కెట్‌లో లభించిన ధరల అంచనాల ప్రాతిపదికన వ్యవసాయశాఖ ఈ సారి ప్రణాళికను రూపొందించింది.

విత్తనాలకు ప్రతిపాదనలు పంపాం..
శ్రవణ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయాధికారి, నల్గొండ

జిల్లాలో వానాకాలం సాగుకు సమాయత్తం చేస్తున్నాం. పత్తి మినహా సాగయ్యే మిగిలిన పంటలకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలు సరఫరా చేస్తుంది. ఏమేరకు ఆయా పంటలు సాగవుతాయో అంచనాలు రూపొందించాం. వాటికి అవసరమయ్యే విత్తనాల వివరాలు ప్రభుత్వానికి పతిపాదనలు పంపాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని