logo

గెలిపిస్తే.. కామారెడ్డికి తాగునీరు తెప్పిస్తా

‘గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఉమ్మడి మాచారెడ్డి మండలం భారీ మెజారిటీనిచ్చింది. పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ పార్టీని మరింత ఆశీర్వదించాలి’ అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ పేర్కొన్నారు.

Published : 28 Apr 2024 05:35 IST

పల్వంచలో మాట్లాడుతున్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, పక్కన అభ్యర్థి సురేష్‌ షెట్కార్‌

మాచారెడ్డి, న్యూస్‌టుడే: ‘గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఉమ్మడి మాచారెడ్డి మండలం భారీ మెజారిటీనిచ్చింది. పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ పార్టీని మరింత ఆశీర్వదించాలి’ అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. మాచారెడ్డి, పల్వంచ మండలాల్లో పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను గెలిపిస్తే కామారెడ్డి నియోజకవర్గానికి తాగునీరు తెప్పిస్తానని అన్నారు. భారాస ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల పథకానికి సరైన నిధులు కేటాయించకుండా పనులను నిలిపివేసిందని, లేకుంటే మాచారెడ్డికి నీళ్లు వచ్చేవని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే ఉపాధి హామీ కూలీలకు రూ.400 చెల్లింపు, ఆగస్టు 15 వరకు రూ.రెండు లక్షల రుణమాఫీ, ధరణితో కోల్పోయిన భూములను కాపాడుతామని తెలిపారు. బీబీపాటిల్‌ వచ్చిన నిధులను కేంద్రానికి తిరిగి పంపించారని ఎద్దేవా చేశారు. జహీరాబాద్‌ ఎంపీ కాంగ్రెస్‌ అభ్యర్థి సురేష్‌ షెట్కార్‌ మాట్లాడుతూ.. బీబీ పాటిల్‌ పదేళ్ల పాలనలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నారు. మ్యానిఫెస్టోలో చెప్పిన ఐదు పథకాలను అమలు చేస్తానని, భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ సందర్భంగా మండలాలకు చెందిన పలువురు కాంగ్రెస్‌లో చేరారు. డీసీసీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌, మాచారెడ్డి మండలాధ్యక్షుడు నౌసీలాల్‌, పల్వంచ మండలాధ్యక్షుడు రమేశ్‌ గౌడ్‌, యూత్‌ అధ్యక్షుడు రాజిరెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు