logo

సందేహాలుంటే.. ఫోన్‌ కొట్టండి

మే 13న పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రాల్లో కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. బయట గోడలపై పోలింగ్‌ కేంద్రం, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ నంబర్లు వేస్తున్నారు.

Updated : 28 Apr 2024 06:03 IST

మే 13న పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రాల్లో కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. బయట గోడలపై పోలింగ్‌ కేంద్రం, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ నంబర్లు వేస్తున్నారు. దీంతో పాటు పోలింగ్‌ కేంద్రం, బీఎల్‌వో, సూపర్‌వైజర్‌, ఏఈఆర్వో పేర్లు, చరవాణి నంబర్లు అందరికీ తెలిసేలా రాశారు. ఇంకా   ఏవైనా వివరాలు కావాలంటే సెక్టోరల్‌ అధికారి, పోలింగ్‌ బూత్‌ పరిధిలోకి వచ్చే పోలీసు అధికారి, నియోజకవర్గ ఏఆర్వోతో పాటు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి పేర్లు, చరవాణి సంఖ్యలు కూడా ఉంచారు. సహాయ కేంద్రం నంబరు 1950ను సైతం రాశారు. పోలింగ్‌ రోజున ఏమైనా ఇబ్బందులుంటే ఆ నంబర్లకు ఓటర్లు ఫోన్‌ చేయొచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎల్‌వో పేరు, వారి చరవాణి నంబరు మాత్రమే ఉండేది.

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ కలెక్టరేట్‌

నిజామాబాద్‌ అర్బన్‌లో ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద రాసిన వివరాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని