logo

ప్రసార సాధనాలు మోదీ, నవీన్‌ గుప్పెట్లో: రాహుల్‌

ప్రసార సాధనాలు మోదీ, నవీన్‌ గుప్పెట్లో ఉన్నాయని, విశ్వసనీయత కోల్పోయాయని రాహుల్‌ గాంధీ సాలెపూర్‌ సమావేశంలో ఆదివారం అన్నారు.

Published : 29 Apr 2024 04:19 IST

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ప్రసార సాధనాలు మోదీ, నవీన్‌ గుప్పెట్లో ఉన్నాయని, విశ్వసనీయత కోల్పోయాయని రాహుల్‌ గాంధీ సాలెపూర్‌ సమావేశంలో ఆదివారం అన్నారు. కాంగ్రెస్‌ వాస్తవాలు చెప్పినా ప్రసార సాధనాలు వక్రీకరిస్తూ కథనాలు ప్రసారం చేస్తున్నాయన్నారు. ఎలక్ట్రానిక్‌ మీడియా, పత్రికలు సక్రమంగా విధులు నిర్వహించడం లేదని, అందుకే కాంగ్రెస్‌ గ్యారంటీలను తాము స్వయంగా ప్రజలకు తెలియజేస్తున్నామని, వీటి గురించి ప్రసార సాధనాలు ప్రస్తావించకపోయినా జనం తెలుసుకునేలా అన్నిచోట్లా తాను వివరిస్తున్నట్లు రాహుల్‌ చెప్పుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని