logo

‘జగన్నాథ్‌’లకు అగ్ని పరీక్ష

రాయగడ జిల్లాలో బిసంకటక్‌ విధానసభ నియోజకవర్గం ప్రతిష్ఠాత్మకం కానుంది. ఇక్కడ అభ్యర్థులకు గెలుపు నల్లేరు మీద నడక మాత్రం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గెలుపోటములు చవిచూసిన రాష్ట్ర మంత్రి, బిజద అభ్యర్థి జగన్నాథ సరక, భాజపా నుంచి జగన్నాథ నుండ్రుక రంగంలోకి దిగారు.

Published : 29 Apr 2024 04:22 IST

రాయగడ, న్యూస్‌టుడే: రాయగడ జిల్లాలో బిసంకటక్‌ విధానసభ నియోజకవర్గం ప్రతిష్ఠాత్మకం కానుంది. ఇక్కడ అభ్యర్థులకు గెలుపు నల్లేరు మీద నడక మాత్రం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గెలుపోటములు చవిచూసిన రాష్ట్ర మంత్రి, బిజద అభ్యర్థి జగన్నాథ సరక, భాజపా నుంచి జగన్నాథ నుండ్రుక రంగంలోకి దిగారు. వీరిద్దరికీ నియోజకవర్గంలో పట్టున్నప్పటికీ ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు సరకపై వ్యతిరేకత కనబరుస్తున్నాయి. పర్యటనకు వెళ్లిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఓ గ్రామస్థులు తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నట్లు తెలియజేసి నీరందించాలని కోరారు. సరక అనుచరులు వారిపై దాడికి ప్రయత్నించడంతో ఆయనపై కేసు నమోదైంది. సరక 2009లో కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ కురువృద్ధుడు డొంబురు దొర ఉలకతో పోటీపడి ఓటమి పాలయ్యారు. 2014, 2019లలో బరిలో దిగిన ఈయనకు పార్టీ సీనియర్‌ నాయకుడు నెక్కంటి భాస్కరరావు పూర్తి సహకారం అందించడంతో విజయకేతనం ఎగరేశారు. రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు భాస్కరరావును కాదని సుధీర్‌ దాస్‌, కొండబాబులతో మైత్రి సాగిస్తున్నారు. ఈసారి సరక గెలుపు సాధ్యమా అన్న అనుమానం వ్యక్తమవుతోంది.

మాటల మాంత్రికుడు నుండ్రుక

జగన్నాథ నుండ్రుక మంచి వక్తగా పేరు పొందారు. 1979లో జన్మించిన ఈయన 2002 నుంచి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. బిజద ప్రోత్సాహంతో నాలుగుసార్లు సర్పంచిగా, తర్వాత ప్రత్యేక అభివృద్ధి మండలి అధ్యక్షుడుగా పనిచేశారు. ఈసారి బిజద టికెట్‌ లభించకపోవడంతో ఇటీవల భాజపాలో చేరారు. ప్రస్తుతం భాజపా తరఫున బరిలో ఉన్నారు. నువ్వా.. నేనా అన్నట్లుగా పోటీ ఉండబోతోందని ఊహా గానాలు వినిపిస్తున్నాయి. జగన్నాథ్‌లు ఇద్దరికీ ఈ ఎన్నికలు అగ్ని పరీక్షే అని చెప్పవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని