logo

కూలీ పనికి వెళ్ళిన బాలిక, యువతి అదృశ్యం

కూలీ పనుల నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లి బాలిక, యువతి అదృశ్యమైన ఘటన నవరంగపూర్‌ జిల్లా రాయ్‌ఘర్‌ సమితి మహడ గ్రామంలో చోటుచేసుకుంది.

Published : 29 Apr 2024 16:55 IST

నవరంగపూర్‌: కూలీ పనుల నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లి బాలిక, యువతి అదృశ్యమైన ఘటన నవరంగపూర్‌ జిల్లా రాయ్‌ఘర్‌ సమితి మహడ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జహబులాల్ గండ్‌ కుమారై దీపాళి (16), నయాల్ గండ్ కుమ్మ అంజలి గండ్ (20) ఎనిమిది నెలల క్రితం గురుసింగ్ గ్రామానికి చెందిన దళారీ దేవేంద్ర కుమార్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌కు కూలీ పనికి వెళ్ళారు. నెలలు గడుస్తున్నా తమ కుమార్తెల నుంచి ఒక్క ఫోన్ రాకపోవటంతో, దళారి వద్దకు వెళ్ళి తమ కుమార్తెల ఆచూకీపై ఆరా తీశారు. దేవేంద్ర దురుసుగా సమాధానం ఇవ్వటంతో 15రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎటువంటి దర్యాప్తు చేపట్టకపోవడంతో మీడియాను సహాయం కోరారు. దీనిపై ఠాణాధికారి రఘునాథ్‌ మాట్లాడుతూ..  కేసు నమోదు చేసుకొని దళారిని దర్యాప్తు చేసేందుకు వెళ్లగా అతడు పరారయ్యడని పేర్కొన్నారు. అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నామన్నారు. తమ కుమార్తెలను అమ్మేశారా లేక అప్పగించేశారా? వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. ఈ విషయంపై మీడియా ప్రతినిధులు పాలనాధికారి డా. కమల్ లోచన్ మిశ్రా దృష్టికి తీసుకువెళ్లగా, వెంటనే జిల్లా కార్మిక శాఖాధికారితో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని