logo

ఒంగోలులో కొత్త రంగుల ప్రపంచం

‘కొత్త రంగుల ప్రపంచం’ చిత్రం యూనిట్‌ బృందం ఒంగోలులో మంగళవారం సందడి చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో దర్శకుడు, సినీ నటుడు పృథ్వీరాజ్‌ మాట్లాడారు. ‘కొత్త రంగుల ప్రపంచం’ జనవరి 20న విడుదలైందన్నారు. బలమైన కథను నమ్ముకుని ఒంగోలుకు చెందిన క్రాంతికృష్ణను కథానాయకుడిగా, శ్రీలును నాయికగా చిత్రసీమకు పరిచయం చేసినట్లు చెప్పారు.

Updated : 24 Jan 2024 06:19 IST

థియేటర్‌ వద్ద అభివాదం చేస్తున్న నటీనటులు పృథ్వీరాజ్‌, క్రాంతి కృష్ణ, శ్రీలు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ‘కొత్త రంగుల ప్రపంచం’ చిత్రం యూనిట్‌ బృందం ఒంగోలులో మంగళవారం సందడి చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో దర్శకుడు, సినీ నటుడు పృథ్వీరాజ్‌ మాట్లాడారు. ‘కొత్త రంగుల ప్రపంచం’ జనవరి 20న విడుదలైందన్నారు. బలమైన కథను నమ్ముకుని ఒంగోలుకు చెందిన క్రాంతికృష్ణను కథానాయకుడిగా, శ్రీలును నాయికగా చిత్రసీమకు పరిచయం చేసినట్లు చెప్పారు. వీళ్లేం నటులంటూ ఎగతాళి చేసినవారే వారి ప్రదర్శనతో ఇప్పుడు అవాక్కవుతున్నారన్నారు. సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. హీరో, హీరోయిన్లు క్రాంతికృష్ణ, శ్రీలు మాట్లాడుతూ.. చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఒంగోలుకు రావడం ఆనందంగా ఉందన్నారు. చిత్ర బృందాన్ని చూసేందుకు పలువురు నగర వాసులు థియేటర్‌ వద్దకు చేరుకున్నారు. అనంతరం చిత్రం ప్రదర్శితమవుతున్న గోరంట్ల కాంప్లెక్స్‌లోని పద్మావతి థియేటర్‌కు చేరుకున్నారు. నటీనటులు, ప్రేక్షకులతో సినిమా వీక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు