logo

వైకాపా ప్రచారంలో ఉద్యోగులు

గత మంగళవారం దర్శి మండలం చందలూరులో అధికార వైకాపా అభ్యర్థి బూచేపల్లి శివప్రసాదరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ చవలం రామాంజనేయులు, వాలంటీరు సింగంశెట్టి సతీష్‌లు పాల్గొన్నారు.

Updated : 28 Apr 2024 05:38 IST

బూచేపల్లి ప్రచారంలో ఎఫ్‌ఏ రామాంజనేయలు, వాలంటీర్‌ సతీష్‌

తాళ్లూరు, దర్శి, న్యూస్‌టుడే : గత మంగళవారం దర్శి మండలం చందలూరులో అధికార వైకాపా అభ్యర్థి బూచేపల్లి శివప్రసాదరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ చవలం రామాంజనేయులు, వాలంటీరు సింగంశెట్టి సతీష్‌లు పాల్గొన్నారు. ఈ విషయమై శనివారం తెదేపా నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు: కొండపి గ్రామీణం: భవనగిరి వెంకట సుబ్బయ్య అనే  ఉపాధ్యాయుడు వైకాపాకు ఊడిగం చేస్తున్నారని, అతనిపై చర్యలు తీసుకోవాలని పెదకండ్లగుంట గ్రామస్థులు కొండపి ఏఆర్వో కిరణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. 26న ‘ఈనాడు’లో వచ్చిన ‘నీకెందుకింత గులాంగిరీ’ వార్త ముమ్మాటికీ వాస్తవమన్నారు. పాఠశాలకు వెళ్లకుండా సంతకాలు పెట్టి, వైకాపా నాయకుల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. ఆయన బ్యాలెట్‌ ఓట్లు కూడా సేకరిస్తున్నారని ఆరోపించారు.ఆర్వో అరవ కుమార్‌ లేకపోవడంతో ఏఆర్వోకు అర్జీ అందజేశారు. మాజీ సర్పంచి తానికొండ వెంకటేశ్వర్లు, కొల్లా మోహన్‌, కొల్లా రామకోటు, తానికొండ సంగమేశ్వరరావు, కొల్లా లక్ష్మీనారాయణ, తలమంచి మాల్యాద్రి, కాకర్ల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని