logo

వైకాపా పాలనకు చరమగీతం పాడాలి

బీసీల సంక్షేమానికి తెదేపా కట్టుబడి ఉందని మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 29 Apr 2024 02:47 IST

\

గిద్దలూరు : రజకసంఘం నాయకులతోఅశోక్‌రెడ్డి , తెదేపా నాయకులు

గిద్దలూరు పట్టణం, కంభం, కంభం(రాచర్ల) : బీసీల సంక్షేమానికి తెదేపా కట్టుబడి ఉందని మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆదివారం గిద్దలూరులో రజక సంఘీయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.

  • గిద్దలూరు మండలం సంజీవరాయునిపేటలో అశోక్‌రెడ్డి సతీమణి పుష్పలీల ఇంటింటికి తిరిగి సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరించారు.
  • కంభం పట్టణంలోని ఓ అపార్టుమెంట్‌ వద్ద అశోక్‌రెడ్డి సమక్షంలో నర్సిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 15 కుటుంబాల వారు తెదేపాలో చేరారు. పట్టణంలో అశోక్‌రెడ్డి సోదరుడు జగన్నాథ్‌రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
  • రాచర్ల మండలం సత్యవోలు, రంగారెడ్డిపల్లి గ్రామాల్లో ఎన్‌డీఏ అభ్యర్థి అశోక్‌రెడ్డి సోదరి గీత ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

పొదిలిలో ఓటు అభ్యర్థిస్తున్న నారాయణరెడ్డి చెల్లెలు లక్ష్మి

తర్లుపాడు, పొదిలి గ్రామీణం, మార్కాపురం పట్టణం, పొదిలి  :  తర్లుపాడు మండలంలోని మీర్జాపేట, చెన్నారెడ్డిపల్లె, నాగెళ్లముడుపు తదితర గ్రామాల్లో ఆదివారం ప్రచారరథంపై కందుల నారాయణరెడ్డి మూడోరోజు యాత్ర కొనసాగించారు.  పొదిలి మండలంలోని కంభాలపాడు గ్రామంలో ఎస్సీ కాలనీ వాసులు పది కుటుంబాలు ఆదివారం మార్కాపురం తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యలో పార్టీలో చేరారు.

  • మార్కాపురం పట్టణంలో కందుల నారాయణరెడ్డి సతీమణి వసంతలక్ష్మీ ప్రచారం చేశారు.
  • నారాయణరెడ్డి చెల్లెలు కందుల లక్ష్మి, తెదేపా నాయకులతో కలిసి పొదిలి పాతూరులో ప్రచారం నిర్వహించారు.

పెద్దారవీడు,యర్రగొండపాలెం పట్టణం:  పెద్దారవీడు మండలంలోని రాజంపల్లి, కొండారెడ్డి కాలనీ, కర్రోల, వైడీపాడులో ఆదివారం వైపాలెం ఎన్డీఏ కూటమి అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు ప్రచారం నిర్వహించారు. యర్రగొండపాలెం పట్టణంలో తెదేపా తరుపున  ఎరిక్షన్‌బాబు కుమారుడు, కుమార్తె అజిత్‌, చెల్సియాలు ఆదివారం తన తండ్రి కోసం విస్త్రత ప్రచారం నిర్వహించారు.


కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రచారం

కంభం (రాచర్ల), న్యూస్‌టుడే : రాచర్ల మండలం అనుమలవీడు, పాలకవీడు, సోమిదేవిపల్లి, గుడిమెట్ట, అంకిరెడ్డిపల్లి, యడవల్లి, సత్యవోలు, తదితర గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పగడాల పెద్ద రంగస్వామి ఆదివారం ప్రచారం నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని