logo

ఆర్టీసీ డ్రైవర్‌, కండక్టర్‌ సీట్లూ వదలొద్దు

ఓటర్లను ప్రభావితం చేసేలా నగదు, మద్యం, ఇతర వస్తువులు పంపిణీ చేపట్టకుండా పటిష్ఠ నిఘా అవసరమని ఎన్నికల వ్యయ ప్రత్యేక పరిశీలకులు నీనా నిగమ్‌ సూచించారు.

Published : 02 May 2024 02:11 IST

సమీక్షిస్తున్న ఎన్నికల వ్యయ ప్రత్యేక పరిశీలకులు నీనా నిగమ్‌.. చిత్రంలో కలెక్టర్‌, ఎస్పీ, అధికారులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఓటర్లను ప్రభావితం చేసేలా నగదు, మద్యం, ఇతర వస్తువులు పంపిణీ చేపట్టకుండా పటిష్ఠ నిఘా అవసరమని ఎన్నికల వ్యయ ప్రత్యేక పరిశీలకులు నీనా నిగమ్‌ సూచించారు. ఒంగోలు ప్రకాశం భవన్‌లో సంబంధిత అధికారులతో ఆమె బుధవారం సమీక్షించారు. అనుమానిత ఆర్థిక లావాదేవీలను బ్యాంక్‌ అధికారులు ఎప్పటికప్పుడు జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తేవాలని స్పష్టం చేశారు. చెక్‌పోస్టుల్లో తనిఖీలను ముమ్మరం చేయాలని, ప్రైవేట్‌ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ సీట్లను కూడా నిశీతంగా పరిశీలించాలని ఆదేశించారు. అదే సమయంలో సాధారణ ప్రయాణికులు, పౌరులను ఇబ్బందులకు గురిచేయొద్దని సూచించారు. జిల్లాలో తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌, ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. అనంతరం ఎన్నికల పరిశీలన కోసం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. సమావేశంలో ఎన్నికల పరిశీలకులు రోహిత్‌ ఇండోరా, సాతే సందీప్‌ ప్రదీప్‌, డ్యూక్‌ బిశ్వాస్‌, కన్నయ్య పొద్దార్‌, ఏఎస్పీ నాగేశ్వరరావు, సహాయ కలెక్టర్‌ శౌర్యమన్‌ పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని