logo

మరో స్వచ్ఛంద సంస్థ ప్రారంభించిన లారెన్స్‌

నృత్యదర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్‌ పలు స్వచ్ఛంద సంస్థలు నెలకొల్పి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘మాట్రం’ అనే సంస్థనూ ఏర్పాటు చేశారు. దాని ద్వారా నిస్సహాయకులకు సాయం అందించనున్నట్టు ప్రకటించారు.

Published : 30 Apr 2024 00:50 IST

 చెన్నై: నృత్యదర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్‌ పలు స్వచ్ఛంద సంస్థలు నెలకొల్పి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘మాట్రం’ అనే సంస్థనూ ఏర్పాటు చేశారు. దాని ద్వారా నిస్సహాయకులకు సాయం అందించనున్నట్టు ప్రకటించారు. తాను చదివించిన పలువురు యువకులూ తమవంతు సాయం అందించనున్నారంటూ తన ఎక్స్‌ పేజీలో లారెన్స్‌ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తనవంతు సాయం అందించనున్నట్టు దర్శకనటుడు ఎస్‌జే సూర్య కూడా వెల్లడించారు. మే 1న మాస్టర్‌ (లారెన్స్‌) సూచించేవారికి తాను సాయం చేస్తానని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని