logo

కుటుంబ సమేతంగా కొడైకెనాల్‌కు సీఎం

ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఐదు రోజుల వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సమేతంగా కొడైకెనాల్‌కు వెళ్లారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రం, పుదుచ్చేరిలోని 40 నియోజకవర్గాల్లోనూ ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటనతో ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

Published : 30 Apr 2024 01:03 IST

 మదురై విమానాశ్రయం నుంచి బయటకొస్తున్న స్టాలిన్‌ దంపతులు

చెన్నై, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఐదు రోజుల వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సమేతంగా కొడైకెనాల్‌కు వెళ్లారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రం, పుదుచ్చేరిలోని 40 నియోజకవర్గాల్లోనూ ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటనతో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదు రోజుల పర్యటనకు సోమవారం కొడైకెనాల్‌ వెళ్లారు. చెన్నై విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి డీఎంకే కోశాధికారి టీఆర్‌ బాలు, మంత్రి సుబ్రమణియన్‌ తదితరులు వీడ్కోలు పలికారు. ప్రత్యేక విమానం ద్వారా మదురై వెళ్లి అక్కడి నుంచి కారు ద్వారా కొడైకెనాల్‌ చేరుకున్నారు.


 గంజాయితో పాటు వినతి ఇవ్వడానికి యత్నించిన భాజపా నాయకుడి అరెస్టు

ప్యారిస్‌: ముఖ్యమంత్రికి గంజాయితో పాటు వినతి ఇవ్వడానికి భాజపా నాయకుడు యత్నించిన ఘటన కలకలం సృష్టించింది. కుటుంబంతో పాటు కొడైక్కానల్‌కి బయల్దేరిన ముఖ్యమంత్రి స్టాలిన్‌ చెన్నై నుంచి మదురై విమానాశ్రయానికి వచ్చారు. వ్యక్తిగత పర్యటన కావడంతో ఆయనకు స్వాగతం పలికేందుకు పార్టీ నేతలకు అనుమతివ్వలేదు. ఈ నేపథ్యంలో విమానాశ్రయం వద్ద ఓ వ్యక్తి నిల్చుని ఉండడంతో పోలీసులు ఆరా తీశారు. ఆయన మదురైకి చెందిన భాజపా ప్రముఖుడు శంకరపాండి, సీఎంకు వినతి ఇవ్వడానికి వచ్చినట్లు తెలిసింది. పోలీసులు అతని నుంచి గంజాయి, వినతిపత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో.. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా గంజాయి, మత్తుపదార్థాల వినియోగం ఎక్కువైందని, సులభంగా లభిస్తుండడంతో యువత, విద్యార్థులు, పేద కూలీలు, చిన్నారులు మత్తుకు బానిసైయ్యారని, నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరారు. గంజాయితో పాటు వినతి ఇవ్వడానికి వచ్చినట్లు చెప్పడంతో అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని